Gold and Silver Rate Today in Hyderabad: బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. దేశీయంగా బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం మీద వెయ్యి రూపాయల మేర తగ్గగా.. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (జూన్ 26) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000లుగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,820గా ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గుముఖం పట్టడమే గత 10 రోజులుగా పసిడి ధరలు తగ్గుతున్నాయి.
Also Read: Raj Tarun Tag: రాజ్ తరుణ్‌కి ‘ట్యాగ్’.. ఏంటో తెలుసా?
దేశ రాజధాని ఢిల్లీలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.64,150 పలకగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,950గా ఉంది. హైదరాబాద్‌లో మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన (24 క్యారెట్ల) పసిడి ధర రూ.69,820గా పలుకుతోంది. ఆర్నమెంట్‌కు వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,000లుగా ఉంది. వెండి ధర కూడా నేడు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.84,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.89,000గా నమోదైంది.