మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ కి 60 సంవత్సరాల వయసుగల ఓ వ్యక్తి ఒక కంప్లైంట్ తీసుకొని వచ్చి అక్కడున్న రిసెప్షన్లో అధికారాన్ని కలిసి నేను మల్కాజ్‌గిరిలోని ఓ హెయిర్ కట్టింగ్ సెలూన్ కి వెళ్లి హెయిర్ కట్టింగ్ చేయించుకున్నాను అని తర్వాత తన మెడలో ఉన్న బంగారు గొలుసు మిస్సయిందని కంప్లైంట్ ను అధికారి ముందు ఉంచాడు. కంప్లైంట్ అందుకున్న తర్వాత సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి క్షురకుడుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.
కానీ ఆ గొలుసు దొరకలేదు. షాప్ లో ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడం కంప్లైంట్ ఇచ్చిన పెద్దాయన కచ్చితంగా షాప్ లోనే పోయిందనడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో క్షురకుడు పెద్దాయన వద్ద నుంచి బంగారు చైన్ ని దొంగిలించి తన మర్మాంగంకు చుట్టుకున్నాడు. అవ్వాకయిన పోలీసులు గొలుసును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్ రావు తెలిపారు
