Site icon NTV Telugu

Gold Rate Today: భగ్గుమన్న బంగారం, వెండి ధరలు.. నేడు రూ. 870 పెరిగిన పసిడి ధర..

Goldrates

Goldrates

బంగారం వెండి ధరలు తగ్గేదెలే అంటున్నాయి. ఒకదానితో ఒకటి పోటీపడుతూ పరుగులు తీస్తున్నాయి. నేడు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 870 పెరిగింది. కిలో వెండి ధర రూ. 1000 పెరిగింది. దరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,193, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,260 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 800 పెరిగింది. దీంతో రూ.1,02,600 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 870 పెరిగింది. దీంతో రూ. 1,11,930 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read:Tirupati Murder Mystery: తిరుపతి అటవీ ప్రాంతంలో నాలుగు మృతదేహాల మిస్టరీలో మరో ట్విస్ట్

విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,800 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,07,770 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,44,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,34,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

Exit mobile version