NTV Telugu Site icon

Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

Gold Pricee

Gold Pricee

గోల్డ్ లవర్స్‌కి కాస్త ఊరట కలిగించే విషయమనే చెప్పాలి. వరుసగా రెండు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఏప్రిల్ 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.92,840గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల్లో రూ.710, రూ.930 పెరిగిన విషయం తెలిసిందే.

Also Read: PBKS VS LSG: లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో భారీ షాక్!

భారత దేశంలో పసిడితో పాటు వెండికీ మంచి గిరాకీనే ఉంటుందన్నా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెండి ధరలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. నిన్న భారీగా పెరిగిన వెండి ధర నేడు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ఈరోజు రూ.1,05,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 14 వేలుగా నమోదైంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.1,05,000గా కొనసాగుతోంది. బుధవారం ఉదయం 10 గంటల వరకు నమోదైన బంగారం, వెండి ధరల డీటెయిల్స్ ఇవి.