Site icon NTV Telugu

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?

Gold Price Today

Gold Price Today

కొనుగోలుదారులకు బంగారం ధరలు మరలా భారీ షాకిచ్చాయి. ఇటీవలి రోజుల్లో వరుసగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,050 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1,140 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (జులై 1) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,200గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,400గా నమోదైంది. బంగారం ధర మళ్లీ భారీగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,200గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,400గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.90,350గా.. 24 క్యారెట్ల ధర రూ.98,550గా నమోదైంది. ప్రాంతాల వారీగా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా బంగారం ధరలు దాదాపు రూ.5వేల వరకు దిగివచ్చాయి. ఈ ఒక్కరోజే వెయ్యికి పైగా పెరిగింది.

Also Read: AP BJP President: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్.. పార్టీ బాధ్యతలను అప్పగించిన పురంధేశ్వరి!

మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. ఇటీవల తగ్గుతూ వచ్చిన వెండి.. నేడు భారీగా పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.2,300 పెరిగి.. రూ.1,10,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష 20 వేలుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి లక్ష 10 వేలుగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇవి.

Exit mobile version