Gold Rates Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

  • స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
  • ఈరోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
Gold Price Today

Gold Price Today

Gold Rates Today: గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 10 రోజుల క్రితం పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా.. ఐదు రోజుల కిందట మళ్లీ పెరుగుదల కనిపించింది. మంగళవారం పెరిగిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. బుధవారం బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,380 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,530గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.66,350గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,380గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.66,900గా.. 24 క్యారెట్ల ధర రూ.72,980గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్​, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల ధర రూ.66,350 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,380గా ఉంది.

వెండి ధరలు ఈ రోజు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.50 పెరిగి.. రూ.91,050గా నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,050గా ఉండగా.. ముంబైలో సైతం రూ.91,050గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.96,000లుగా నమోదవ్వగా.. బెంగళూరులో రూ.450 పెరిగి అత్యల్పంగా రూ.90,500గా ఉంది.