Gold and SIlver Rates in Hyderabad: వరుసగా రెండు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు.. నిన్న స్వల్పంగా తగ్గాయి. అయితే స్వాతంత్య్ర దినోత్సవం వేళ నేడు గోల్డ్ రేట్స్ స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 15) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,550గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,510గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,550లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,510గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.65,600 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.71,660గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,510గా నమోదైంది.
Also Read: Viral Video: అరె ఏంట్రా ఇది.. ఇద్దరు యువతులతో ఒకేసారి కారులో సరసాలు!
మరోవైపు వెండి ధర నేడు స్వల్పంగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.100 తగ్గింది. నేడు కిలో వెండి రూ.83,500గా ఉంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయాయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.88,500గా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరులో రూ.80,000గా ఉంది.