Gold Rate Today Decreased By Rs 400 in Hyderabad: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పసిడి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. వరుసగా రెండోరోజు పుత్తడి ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.800 తగ్గగా.. నేడు రూ.400 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఆగష్టు 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500గా ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.870 తగ్గగా.. ఈరోజు రూ.440 తగ్గింది. నేడు 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.69,270గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,270గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.63,650 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.69,420గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.69,270గా నమోదైంది.
Also Read: Harish Shankar: ఒక్కసారి పవన్‌కు అభిమాని అయితే.. కట్టె కాలేవరకు ఫ్యాన్‌గానే ఉంటాడు!
మరోవైపు వెండి ధర కూడా నేడు తగ్గింది. బులియన్ మార్కెట్‌లో నిన్న కిలో వెండిపై రూ.3,200 తగ్గగా… నేడు రూ.500 తగ్గింది. నేడు కిలో వెండి రూ.82,000గా నమోదైంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయాయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.87,000గా ఉంది. అత్యల్పంగా బెంగళూరులో 81,000గా నమోదైంది.