బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 220 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 2000 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,171, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,240 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గింది. దీంతో రూ.1,02,400 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 తగ్గింది. దీంతో రూ. 1,11,710 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Karan : పారితోషికం మాత్రమే కాదు.. ప్రమోషన్స్ కూడా బాధ్యతే.. హీరోయిన్లకు వార్నింగ్ ఇచ్చిన నిర్మాత
విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,860 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,42,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,32,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
