Gold Rate Today in in Hyderabad on 20 June 2024: గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. జీవనస్థాయి గరిష్ఠానికి చేరిన పసిడి రేట్స్.. కాస్త దిగొస్తున్నాయని సంతోషించేలోపే షాక్ తగిలింది. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 పెరిగింది. గురువారం (జూన్ 20) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల ధర రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,440గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,440గా ఉంది. రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.66,550గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,590గా నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.66,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,440గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.67,000గా.. 24 క్యారెట్ల ధర రూ.73,010గా నమోదైంది. ఇక బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలలో 22 క్యారెట్ల ధర రూ.66,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,440గా ఉంది.
Also Read: Philip Salt: ఫిలిప్ సాల్ట్ ఊచకోత.. ఓవర్‌లోని అన్ని బాల్స్ ఫోర్లు, సిక్స్‌లే! (వీడియో)
మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1,500 పెరిగి.. రూ.92,500గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.92,500 ఉండగా.. ముంబైలో కూడా రూ.92,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.97,100లుగా నమోదవగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ.90,900గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.97,100లుగా ఉంది.