గోల్డ్ ధరలు నేడు ఊరటనిచ్చాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 110 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 1000 పెరిగింది. రూ. లక్షన్నర దిశగా వెండి పరుగులు తీస్తోంది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,117, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,190 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గింది. దీంతో రూ.1,01,900 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గింది. దీంతో రూ. 1,11,170 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:FIDE Grand Swiss 2025: ఉమెన్ వరల్డ్ చెస్ ఛాంపియన్ vs మెన్ వరల్డ్ చెస్ ఛాంపియన్.. గెలుపెవరిదంటే?
విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,300 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,43,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,33,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
