Site icon NTV Telugu

Godhra Violence: పోలీస్ స్టేషన్‌పై ముస్లిం గుంపు దాడి.. గోద్రాలో టెన్షన్ టెన్షన్

Godhra Violence

Godhra Violence

Godhra Violence: గొడవలు పడి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాలంటేనే కొందరు భయపడుతుంటారు. ఎక్కడైనా గొడవ పడుతున్నట్లు సమాచారం వస్తే పోలీసులు అక్కడికి వెళ్లి గొడవను ఆపుతారని ఇప్పటి వరకు మనకు తెలుసు.. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది.. ఏకంగా ఇక్కడ ముస్లింలు గుంపుగా వచ్చి పోలీసు స్టేషన్‌పై దాడికి దిగారు. ఈ సంచలన సంఘటన శుక్రవారం రాత్రి గుజరాత్‌లో గోద్రా బిడివిజన్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం..

READ ALSO: Minister Seethakka : బ్యాంకులకు మహిళా సంఘాల ద్వారా 98 శాతం రీపేమెంట్

17 మంది అరెస్ట్.. 88 మందిపై ఎఫ్‌ఐఆర్
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్‌తో రెచ్చిపోయిన ఒక ముస్లిం గుంపు స్టేషన్, పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వింది. వీళ్ల దాడి కారణంగా పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో, పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ దాడిలో అనేక పోలీసు వాహనాలు దెబ్బతినడంతో పాటు, అవుట్‌పోస్ట్ నంబర్ 4పై కూడా దాడి జరిగింది. శనివారం ఉదయం నాటికి దాడికి పాల్పడిన 17 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. అలాగే 88 మందిపై కేసు నమోదు చేశామన్నారు. మిగిలిన నిందితుల కోసం 10 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం. ఈసందర్భంగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హరేష్ దుధత్ మాట్లాడుతూ.. గోద్రాలో భారీ పోలీసు బలగాలను మోహరించామని, ఇప్పుడు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉందని, అయితే పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.

ఇంతకీ ఏం జరిగింది..
ఈ వివాదం అంతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జకీర్ జభా చేసిన పోస్ట్ కారణంగా వచ్చినట్లు సమాచారం. దేవీ నవరాత్రి సందర్భంగా పోలీసులు ఆయన్ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి, మత వాతావరణాన్ని దిగజార్చే పోస్ట్‌లు చేయవద్దని హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికలు బేకాతర్ చేస్తూ.. జకీర్ పోలీస్ స్టేషన్ వెలుపల నుంచే ఒక వీడియోను పోస్ట్ చేశారు. “నేను ముహమ్మద్ను ప్రేమిస్తున్నాను” అని రాసి ఉన్న వీడియోను పోస్ట్ చేసినందుకు పోలీసులు తనను కొట్టారని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ వీడియో ప్రశాంతంగా ఉన్న పరిస్థితులను క్షణాల్లో మార్చివేసిందని, నిమిషాల్లోనే వందలాది మంది ముస్లింలు పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడారని, ఆ తర్వాత ఆ గుంపు స్టేషన్‌పై దాడి చేసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఈసందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. ఈ సంఘటన తీవ్రత దృష్ట్యా గోద్రాలో కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పుకార్లను నమ్మకుండా శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ఎవరు ప్రయత్నించినా వారిని వదిలిపెట్టబోమని పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం గోద్రాలో పరిస్థితి అదుపులో ఉందని వారు పేర్కొన్నారు.

READ ALSO: Donald Trump: ఫ్లోరిడా కోర్టులో డోనాల్డ్ ట్రంప్‌కు షాక్.. పాపం అమెరికా అధ్యక్షుడు..

Exit mobile version