Site icon NTV Telugu

Godavari Flood: భారీ వర్షాలు.. గండి పోచమ్మ ఆలయాన్ని తాకిన వరద నీరు

Gandi Pochamma

Gandi Pochamma

Godavari Flood: ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. మరోవైపు గోదావరి నదిలో వరద పోటెత్తింది. దీంతో.. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన గండి పోచమ్మ ఆలయాన్ని తాకింది వరదనీరు.. అమ్మవారి దేవస్థానం మండపం సమీపానికి పోటెత్తిన వరద నీరు ప్రవహిస్తోంది.. స్నానాల ఘాటు వద్ద మెట్లు పూర్తిస్థాయిలో నీటమునిగాయి.. మరోపక్క గండి పోచమ్మ ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గంలో దండింగి గ్రామం వద్ద రోడ్డుపైకి భారీగా వరదనీరు చేరింది.. అయితే, ముందస్తు సమాచారం లేకపోవడంతో ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గం లేక భక్తులు తీర్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది..

Read Also: Uttar Pradesh : భర్త వేరే కలర్ లిప్ స్టిక్ తెచ్చాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య

ఇక, గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున స్నానాల రేవులు మూసివేయడమైనది.. ఫోటోలకు గానీ, సెల్ఫీలకు గానీ.. మరే ఇతర పనులకు గానీ.. గోదావరి ఒడ్డులకు గానీ, గోదావరి దరిదాపులకు గానీ వెళ్లరాదు అంటూ.. ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మాదాయ శాఖ ఓ హెచ్చరిక బోర్డును గండిపోచ్చమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది.. మరోవైపు.. అల్లూరి జిల్లా ముంచింగి పుట్టు మండలం లక్ష్మీపురం పంచాయితీ కర్లపొదర్ వద్ద మత్యగెడ్డ వాగు పొంగిపొర్లుతుంది.. వాగు అవతల పశువుల మంద చిక్కుకుంది.. ప్రమాద కర పరిస్థితుల్లో మేకల మందను వాగు దాటించారు గ్రామస్తులు… వాగు అవతల సుమారు ఇరవై గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. ప్రతీ ఏటా వర్షాకాలంలో వాగు పొంగితే గ్రామాల్లో మగ్గిపోయే పరిస్థితి ఉంది.. గతంలో ఇదే వాగు వర్షాలు ధాటికి వాగు పొంగి పశువుల మంద సహా స్థానికులు కొంతమంది మూడు రోజులు కొండ పై ఉండిపోయిన పరిస్థితి ఉంది.

Exit mobile version