Site icon NTV Telugu

Giraffe Attack: రెండేళ్ల చిన్నారిపై జిరాఫీ ఎటాక్.. వైరల్ వీడియో..

Giraffe Attack

Giraffe Attack

మనలో చాలామంది ఇప్పటికే జూ, జంతు సంబంధిత ప్రదేశాలకు సఫారీలకు కూడా వెళ్లి ఉంటాము. ఇక్కడ అనేక రకాల జంతువులను మనం చూసి ఆనందిస్తాము. ఇక సర్కస్ లాంటి ప్రదేశంలో జంతువులు చేసే విన్యాసాలను చూసి కూడా ఎంతో ఆనందపడతాము. ఇకపోతే సఫారీ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ రకరకాల జంతువులను చూస్తూ ఆస్వాదిస్తాం. అదే ఒక్కోసారి సఫారీ లాంటి ప్రదేశంలో అనేక ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఈ నిమిషంలో తాజాగా మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ జిరాఫీ రెండేళ్ల చిన్నారిని కొన్ని అడుగుల వరకు పైకెత్తి వదిలేసిన సంఘటన సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకు వెళితే..

Birthday Cake: “బర్త్ డే కేక్” తీసుకురావడం ఆలస్యమైందని భార్య, కుమారుడిపై కత్తితో దాడి..

అమెరికాలోని టెక్సస్ పరిధిలో ఉన్న ప్రాంతంలో ఓ వైల్డ్ లైఫ్ సెంటర్ ఉంది. ఇక్కడ సఫారీని చేసేందుకు ప్రతిరోజు ఎంతోమంది సందర్శకులు వస్తుంటారు. ఇకపోతే ఓ రెండేళ్ల చిన్నారి తో పాటు కలిసి వచ్చిన ఓ జంటకి అనుకోని సంఘటన ఎదురయింది.

World Cup 2024: విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ప్రశంసలు..ఏమన్నారంటే?

సఫారీలో వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన వచ్చి జిరాఫీ కనిపించడంతో దానికి ఆహారం అందించేందుకు వారు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో చిన్నారి కూడా జిరాఫీకి ఆహారం అందించేందుకు ప్రయత్నం చేసింది. అయితే ఎవరు ఊహించని విధంగా ఆ చిరాకు ఏకంగా ఆ చిన్నారి చొక్కా పట్టుకొని కారులోంచి బయటికి ఎత్తేసింది. అలా కొన్ని అడుగుల ఎత్తు మేరకు ఆ చిన్నారిని తీసుకువెళ్లి ఆ తర్వాత మళ్లీ కారులోని చిన్నారిని వదిలేసింది. ఈ ఊహించని ఘటనతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఆ వాహనం వెనుక ఉన్న మరో వాహనంలోని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

Exit mobile version