NTV Telugu Site icon

INDvs NZ T20: గిల్‌ సూపర్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోరు

Fdsf

Fdsf

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ సాధించింది. అద్భుత ఫామ్‌తో ఇరగదీస్తున్న యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ టీ20ల్లో తొలి సెంచరీ (63 బంతుల్లో 126 నాటౌట్) తో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 234 /4 స్కోర్ చేసింది. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ (1) మరోసారి విఫలమయ్యాడు. అనంతరం రాహుల్ త్రిపాఠి (44) కలిసి గిల్‌ బాదుడే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ ప్రతర్థి బౌలర్లను ఆడుకోవడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే తొమ్మిదో ఓవర్లో త్రిపాఠిని ఔట్ చేసిన సోధి రెండో వికెట్‌కు 80 రన్స్ భాగస్వామ్యానికి తెరదించాడు. ఆపై సూర్యకుమార్ (24) గిల్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే 12 ఓవర్లో గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్య ఔటైనా.. గిల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. లిస్టర్ వేసిన 16వ ఓవర్లో రెండు సిక్సర్లతో పాటు టిక్నెర్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు సిక్స్‌లు ఓ ఫోర్ బాది సెంచరీకి దగ్గరగా వచ్చాడు. ఆపై 18వ ఓవర్లో మరో సిక్స్‌ బాది టీ20ల్లో మొదటి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలోనూ శతకం బాదిన ఐదో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక, హార్దిక్ (30) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించడంతో టీమిండియా భారీ స్కోర్ నమోదు చేసింది.

గిల్ రికార్డులు

Show comments