INDvs NZ T20: గిల్ సూపర్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ సాధించింది. అద్భుత ఫామ్‌తో ఇరగదీస్తున్న యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ టీ20ల్లో తొలి సెంచరీ (63 బంతుల్లో 126 నాటౌట్) తో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 234 /4 స్కోర్ చేసింది. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ (1) మరోసారి విఫలమయ్యాడు. అనంతరం రాహుల్ త్రిపాఠి (44) కలిసి గిల్ బాదుడే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ ప్రతర్థి బౌలర్లను ఆడుకోవడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే తొమ్మిదో ఓవర్లో త్రిపాఠిని ఔట్ చేసిన సోధి రెండో వికెట్‌కు 80 రన్స్ భాగస్వామ్యానికి తెరదించాడు. ఆపై సూర్యకుమార్ (24) గిల్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే 12 ఓవర్లో గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్య ఔటైనా.. గిల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. లిస్టర్ వేసిన 16వ ఓవర్లో రెండు సిక్సర్లతో పాటు టిక్నెర్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు సిక్స్‌లు ఓ ఫోర్ బాది సెంచరీకి దగ్గరగా వచ్చాడు. ఆపై 18వ ఓవర్లో మరో సిక్స్ బాది టీ20ల్లో మొదటి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలోనూ శతకం బాదిన ఐదో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక, హార్దిక్ (30) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించడంతో టీమిండియా భారీ స్కోర్ నమోదు చేసింది.
గిల్ రికార్డులు
Also Read
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన గిల్.. టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలోనూ శతకం బాదిన ఐదో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. రైనా, కోహ్లీ, రోహిత్, రాహుల్ ఇప్పటికే ఈ ఘనత సాధించారు.
- ఈ మ్యాచ్‌లో గిల్ 126 రన్స్ చేశాడు. టీ20ల్లో ఓ టీమిండియా బ్యాటర్‌కు ఇదే అత్యధిక స్కోరు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు కోహ్లీ (122 నాటౌట్) పెరుమీదున్న రికార్డును తిరగరాశాడు.
- న్యూజిలాండ్ జట్టుపైనా వన్డేలతో పాటు టీ20ల్లోనూ టీమిండియా తరఫున గిల్‌దే అత్యధిక స్కోరు కావడం విశేషం. వన్డేల్లో (208), టీ20ల్లో 126 నాటౌట్.
తాజావార్తలు
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!