NTV Telugu Site icon

GHMC : ఆస్తిపన్ను బకాయిలపై జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం..

Ghmc

Ghmc

GHMC : హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2100 కోట్ల ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే ఇప్పటివరకు దాదాపు రూ.1416 కోట్ల మేరకు మాత్రమే వసూలైంది. ఇప్పటివరకు 12 లక్షల మంది తమ ఆస్తిపన్ను చెల్లించగా, ఇంకా 5 లక్షల మంది భవన యజమానులు బకాయి కట్టాల్సి ఉంది. వీరి నుంచి సుమారు రూ.684 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది.

మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, వసూళ్ల పెంపు లక్ష్యంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బకాయిదారులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ పథకం కింద 90% వడ్డీ రాయితీ కల్పించాలని జీహెచ్‌ఎంసీ ప్రభుత్వం అనుమతి కోరనుంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కమిషనర్‌ ఇలంబర్తి పరిశీలనలో ఉంది.
Tamilnadu : కదులుతున్న రైలులో గర్భిణీ స్త్రీపై అత్యాచారం.. తర్వాత బయటకు తోసేశారు

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.5000 కోట్ల వరకు ఆస్తిపన్ను బకాయిలు ఉన్నట్లు అంచనా. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బకాయిలే రూ.3000 కోట్లు ఉంటే, మిగతా రూ.2000 కోట్లను సాధారణ ఆస్తిపన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ఓటీఎస్‌ పథకాన్ని అమలు చేస్తే కనీసం రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ నెలాఖరులోగా ఓటీఎస్‌ పథకానికి అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఓటీఎస్‌ అమలు అయినట్లయితే, బకాయిదారులు కేవలం 10% వడ్డీ మాత్రమే చెల్లించి తక్కువ ఖర్చుతో తమ ఆస్తిపన్ను రుసుమును పూర్తిగా తీర్చుకునే అవకాశాన్ని పొందనున్నారు.

జీహెచ్‌ఎంసీ గతంలో ఇప్పటికే మూడు సార్లు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకాన్ని అమలు చేసింది. మొదటి విడత – 2020 ఆగస్టు 1 నుంచి నవంబరు 15 వరకు. రెండో విడత – 2022 జులై నెలలో. మూడో విడత – మునుపటి రెండు కార్యక్రమాలను కలిపి దాదాపు రూ.700 కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఓటీఎస్‌ను అమలు చేస్తే కనీసం రూ.500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా దాదాపు 2 లక్షల మంది బకాయిదారులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

ఈ పథకానికి ప్రభుత్వ అనుమతి లభిస్తే, ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారు తక్కువ వడ్డీతో బకాయిలను క్లియర్‌ చేసుకునే వీలుంటుంది. ఇది ఒక వైపు ప్రజలకు ఉపశమనం కలిగించడమే కాకుండా, జీహెచ్‌ఎంసీకి భారీగా ఆదాయాన్ని అందించనుంది.

VC Sajjanar : క్షేత్ర స్థాయి ఉద్యోగులు, అధికారులతో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వర్చువల్ స‌మావేశాలు