Couple In Bathroom: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పండగ రోజున ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. భార్యాభర్తలిద్దరూ హోలీ ఆడి ఇంటికి వెళ్లి బాత్ రూంకెళ్లి చనిపోయారు. దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఈ పండుగను బాగా ఎంజాయ్ చేశారు. అయితే పండగ రోజునే ఓ కుటుంబంలో విషాదం నింపే వార్త ఒకటి బయటకు వచ్చింది. భార్యాభర్తలిద్దరూ హోలీ ఆడి ఇంటికి వెళ్లి బాతురూంలో స్నానానికని వెళ్లి మృత్యువాతపడ్డారు. చనిపోయిన భార్యాభర్తల పేర్లు దీపక్ గోయల్, శిల్పి.
Read Also: YS Viveka murder case: హైకోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి.. ఆ ఆదేశాలు ఇవ్వండి..
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మురాద్‌నగర్ అగ్రసేన్ మార్కెట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బుధవారం భార్యభర్తలు హోలీ ఆడి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ స్నానానికి బాత్‌రూమ్‌కి వెళ్లారు. స్నానానికని వెళ్లిన వారు దాదాపు గంట వరకు బయటకు రాలేదు. అనుమానం వచ్చిన వారి పిల్లలు అరవడం స్టార్ట్ చేశారు. దీంతో ఇరుగుపొరుగు వారు గుమిగూడారు. అమ్మా, నాన్న లోపలే ఉన్నారని, బయటకు రాలేదని పిల్లలు చెప్పారు. ఆ తర్వాత ఇరుగుపొరుగు వారు బాత్‌రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా భార్యాభర్తలు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఇద్దరినీ బయటకు తీసుకొచ్చారు.
Read Also:Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ
ఇంతలో, వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసి, ఘజియాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఇద్దరినీ పరీక్షించగా అప్పటికే వారు చనిపోయినట్లు నిర్ధారించారు. బాత్‌రూమ్‌లోని గీజర్ నుంచి గ్యాస్ లీకేజీ కావడంతో ఊపిరాడక ఇద్దరూ మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మృతికి గల కారణాలు పోస్ట్‌మార్టం రిపోర్టు తర్వాత తేలనుంది.