Huge Discount on iPhone 14 Plus in Flipkart Flagship Sale 2024: స్వాతంత్ర్య దినోత్సవం 2024 సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ భారతదేశంలో తన ‘ఫ్లాగ్‌షిప్ సేల్’ తేదీలను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోని లైవ్ మైక్రోసైట్ ప్రకారం.. ఫ్లాగ్‌షిప్ సేల్ ఆగస్టు 6 నుండి ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ఆరంభమైంది. ఈ సేల్ సమయంలో పలు రకాల ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్లను అందిస్తుంది.
ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్‌లు మరియు ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంకు ఆఫ్ బరోడా కార్డ్ మరియు యెస్ బ్యాంక్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. వినియోగదారులు ఎంచుకున్న వస్తువులపై నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం మరియు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు సేల్ సమయంలో ప్రత్యేకమైన సూపర్ కాయిన్స్ ఆఫర్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు.
Also Read: Dinesh Karthik: మళ్లీ బ్యాట్ పట్టనున్న దినేష్ కార్తీక్.. తొలి క్రికెటర్‌గా రికార్డు!
ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్ సమయంలో ఐఫోన్ 14 ప్లస్ (128జీబీ) ధర భారీగా తగ్గింది. ఐఫోన్ 14 ప్లస్ అసలు ధర రూ. 79,600గా ఉండగా.. రూ.53,999కి అందుబాటులో ఉంది. రూ.50,000లలో కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. ఐఫోన్ 14 ప్లస్ మీ ఉత్తమ ఎంపిక అని చెప్పొచ్చు. ప్రస్తుతం అత్యంత తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. గూగుల్ పిక్సెల్ 7 (30999), శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ (38999), మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ (21999), పోకో ఎఫ్6 (25999) లాంటి స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.