Site icon NTV Telugu

హుజురాబాద్‌ ప్రజలు మార్పునకు నాంది పలకాలి : గెల్లు శ్రీనివాస్

హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ చిన్న చిన్న గోడవలు మినహా… ఇప్పటి వరకైతే… పోలింగ్‌ చాలా ప్రశాంతంగా సాగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే హిమ్మత్‌ నగర్‌ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌. కుటుంబ సమేతంగా వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌… తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. తన ఓటు హక్కు వినియోగించుకున్నానని… ప్రజా స్వామ్యం పరిఢవిల్లాలంటే ఓటు వేయాలని పిలుపు నిచ్చారు గెల్లు శ్రీనివాస్. వంద శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలి… హుజూరాబాద్ ప్రజలు మార్పు కి నాంది కావాలని పేర్కొన్నారు. కాగా.. ఉదయం 11 గంటల వరకు హుజురాబాద్‌ నియోజక ఉప ఎన్నిక లో 33 శాతానికి పైగా పోలింగ్‌ జరిగింది.

Exit mobile version