Site icon NTV Telugu

Gautham Menon: ముచ్చటగా మూడోసారి.. కానీ అక్కడ మొదటిసారి.

Untitled Design (5)

Untitled Design (5)

సమంత, నాగచైతన్య జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఏ మాయ చేసావే. ఆ సినిమాతోనే సమంతను తెలుగు సినీ పరిశ్రమలో లాంఛ్ చేసాడు దర్శకుడు వాసుదేవ్ మీనన్. తొలి చిత్రంలో జేస్సి పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలనే కాకుండ నాగ చైతన్య ప్రేమను సైతం గెలిచింది, తనకుతొలి చిత్రంతో మంచి గుర్తిపు ఇచ్చిన దర్శకుడితో ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాలో నటించింది సమంత. ఆ చిత్రం తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ అయిహిట్ గా నిలిచింది. ఆలా తన కెరీర్ లో తనకు రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ అంటే సమంతకు ప్రత్యేక అభిమానం.

కాగా ఇటీవల పలు అనారోగ్య కారణాలతో సమంత కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆరోగ్య పరమైన చికిత్స తీసుకుంటూనే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫాన్స్ కు అప్ డేట్స్ ఇస్తుంది. ప్రస్తుతం సమంత సిటాడెల్ వెబ్ సిరీస్, బంగారం చిత్రాలకు మాత్రమే సంతకం చేసింది. తెలుగులో ఒక్క సినిమా కూడా చేయట్లేదు సామ్. పుష్ప లో ఐటెం సాంగ్ మంచి ఆదరణ దక్కించుకోవడంతో పలు సినిమాలు ఆఫర్లు వచ్చినా కథ, తన పాత్రకు తగిన ప్రాధాన్యం ఉన్నట్టయితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

తాజాగా సమంతా ఓ మలయాళం సినిమాకు పచ్చ జెండా ఉపినట్టు తెలుస్తోంది. తన కెరీర్ లో రెండు సూపర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత నటించబోతుందని సమాచారం. మమ్ముట్టి హీరోగా, సమంత కీలక పాత్రలో కెరీర్ లో మొదటిసారిగా ఓ మలయాళ సినిమాకు దర్శకత్వం వహించబోతోన్నాడు గౌతమ్ మీనన్. ఈ మలయాళ సినిమాతో గౌతమ్ వాసుదేవ్ మీనన్  మరోసారి హిట్ ఇస్తాడని నమ్మకంతో ఉంది సమంత.

Also Read: Rajtarun : తిరగబడరసామీ థియేట్రికల్ రిలీజ్ డేట్ వచ్చేసింది..

Exit mobile version