IPL 2024: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ గురించి అందరికి తెలిసిందే.. గత ఏడాది లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఉన్న సమయంలో గంభీర్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే, ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా గంభీర్ బాధ్యతలను చేపట్టాడు. దీంతో కోల్‌కతా, ఆర్సీబీ మ్యాచ్ అనగానే అందరి దృష్టి కోహ్లి- గంభీర్‌లపైకి వెళ్తాయి. కానీ, ఆర్సీబీ ఇన్నింగ్స్ వ్యూహ విరామ టైంలో ఈ ఇద్దరూ నవ్వుతూ పలకరించుకోవడం మైదానంలో కనిపించింది.
Read Also: Uttarakhand: ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన ప్రధాని.. ఉత్తరాఖండ్‌లో ఏప్రిల్ 2న మోడీ సభ!
ఇక, మైదానంలోకి వచ్చిన గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లి దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కోహ్లి కూడా నవ్వుతూ దగ్గరకు వెళ్లి గంభీర్‌ను హత్తుకున్నాడు. ఇద్దరూ కాసేపు ఏదో మాట్లాడుకున్నారు.. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, మ్యాచ్‌లో అత్యుత్తమ సందర్భం ఇదేనంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కామెంట్రీ బాక్స్ నుంచి వ్యాఖ్యనించారు. ఈ సందర్భానికి ఫెయిర్ ప్లే అవార్డు దక్కాలంటూ భారత జట్టు మాజీ కోచ్, వ్యాఖ్యాత రవిశాస్త్రి పేర్కొనగా.. కేవలం ఫెయిర్ ప్లే అవార్డే కాదు వీళ్లకు ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వాలంటూ గవాస్కర్ చమత్కరించాడు.