Mohammad Kaif: నరాలు తెగే ఉత్కంఠ మధ్య టీం ఇండియా తెందుల్కర్- అండర్సన్ ట్రోఫీలో ఐదో మ్యాచ్ గెలిచింది. గెలుపు కోసం మైదానంలో ఉన్న ప్లేయర్స్ మాత్రమే మరోకరూ కూడా తీవ్రంగా ఒత్తిడికి గురయ్యారు. ఆయన మరెవరో కాదు టీం ఇండియా చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానల్లో ఈ టెస్ట్ సిరీస్ మీద, చీఫ్ కోచ్‌పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
READ MORE:Harish Rao : మహిళా ఎమ్మెల్యే అవమానం సిగ్గుచేటు.. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
గంభీర్ తీసుకున్న నిర్ణయం సరైనదే…
కైఫ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడుతూ.. ‘మనమంతా బుమ్రా గైర్హాజరీలో కుల్‌దిప్‌ను ఆడించాలన్నాం. కానీ గంభీర్ బ్యాటింగ్ డెప్త్ గురించి ఆలోచించాడు. బ్యాటింగ్లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ను చూశాం. బ్యాటింగ్లో డెప్త్ ఉండటం వల్లే టీమ్ ఇండియా భారీ స్కోర్లు చేయగలిగింది. అతడు ఎనిమిదో స్థానం వరకు బ్యాటర్లు ఉండాలని కోరుకున్నాడు. అతడి నిర్ణయమే సరైనదని నిరూపించుకున్నాడు. ఈ కారణంగా భారత్ ఈ సిరీస్‌ను డ్రా చేసుకుందనడంలో సందేహం లేదు. గంభీర్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతగా అనుభవం లేని యువ ఆటగాళ్లతో ప్రస్తుతం టీమ్ ఇండియా నిండి ఉంది. ఈ నేపథ్యంలో కోచ్‌గా గంభీర్ మీద ఎంత ఒత్తిడి ఉండి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను.. అని పేర్కొన్నాడు.
చీఫ్ కోచ్‌పైనే ఎక్కువ ఒత్తిడి..
తెందుల్కర్- అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్, టీమ్ ఇండియా మధ్య జరిగిన అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్‌లో ఇరుజట్లూ రెండు మ్యాచ్లు గెలవగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగియడంతో సిరీస్ 2-2తో సమమైంది. ఈ సిరీస్‌పై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అందరికన్నా ఎక్కువ ఒత్తిడి ఈ టూర్‌లో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మీద ఉందని అన్నాడు. ఎందుకు ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశాడనేది వివరిస్తూ.. సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ ఇండియా పర్ఫామెన్స్ అద్భుతంగా లేదని, స్వదేశంలో కూడా న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని భారత్ మూటగట్టుకుందని గుర్తు చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ టీమ్ ఇండియా చెప్పుకోదగ్గ ఆట తీరును ప్రదర్శించలేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈనేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను ఒకవేళ భారత్ కోల్పోయి ఉంటే.. గౌతమ్ గంభీర్ కోచ్ పదవి ప్రమాదంలో పడేదని అన్నారు. బహుశా అతడికి కోచ్‌గా ఇదే ఆఖరి టెస్ట్ మ్యాచ్ కూడా అయి ఉండేదేమో. కానీ అలా జరగరకపోవడం సంతోషకరం అని అన్నాడు.
READ MORE: Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ అనకండి నేను గేమింగ్ యాప్ ప్రమోట్ చేశా !
