శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు చారిత్రాత్మక మైదానం లార్డ్స్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంది. కానీ ఓటమిపాలైంది. ఈ ఓటమి తర్వాత, భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలోని టెస్ట్ క్రికెట్ జట్టు ప్రదర్శన ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో మూడో టెస్ట్‌లో ఓటమితో, ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సిరీస్‌ను కోల్పోయే ప్రమాదం భారత జట్టుపై పొంచి ఉంది. గౌతమ్ గంభీర్ నాయకత్వంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో భారత్ కొన్ని కీలక విజయాలు సాధించినప్పటికీ, టెస్ట్ ఫార్మాట్‌లో నిరంతర వైఫల్యాలు అతని కోచింగ్ పదవీకాలంపై ప్రశ్నార్థకంగా మారాయి. ఇంగ్లాండ్‌లో ఈ సిరీస్‌ను భారత్ ఓడిపోతే, బీసీసీఐ గంభీర్ భవిష్యత్తును పునరాలోచించే అవకాశం ఉందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
Also Read:Amit Shah: ప్రధాని మోడీ రామమందిరాన్ని నిర్మించారు, 5జీని తీసుకొచ్చారు.
ఇప్పటివరకు, గంభీర్ సారథ్యంలో భారత్ మొత్తం 13 టెస్ట్‌లు ఆడింది. వాటిలో ఎనిమిది ఓడిపోయింది, నాలుగు గెలిచింది, ఒక మ్యాచ్‌ను మాత్రమే డ్రాగా ముగిసింది. గంభీర్ హెడ్ కోచ్ గా పగ్గాలు చేపట్టాకా టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో 0-3 తేడాతో ఓడిపోయింది. ఇది 12 సంవత్సరాల తర్వాత తొలి స్వదేశీ టెస్ట్ సిరీస్ ఓటమి. దీని తర్వాత, ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా భారత్ 1-3 తేడాతో ఓడిపోయింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రస్తుత సిరీస్‌లో, భారతదేశం లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్‌ను కోల్పోయింది, తరువాత ఎడ్జ్‌బాస్టన్‌లో తిరిగి పుంజుకుని సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కానీ మళ్ళీ మూడవ మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. టీమిండియా సిరీస్‌ను కాపాడుకోవడానికి అగ్ని పరీక్షగా మారింది.
Also Read:Off The Record: ఆ జనసేన ఎంపీ పర్ఫార్మెన్స్‌లో తక్కువ..! ప్రమోషన్స్‌లో ఎక్కువ..?
భారత్ ఇప్పుడు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ జూలై 23న ప్రారంభమవుతుంది. దీని తర్వాత, సిరీస్‌లోని చివరి, ఐదవ మ్యాచ్ లండన్‌లోని ది ఓవల్ మైదానంలో జరుగుతుంది. భారత్ సిరీస్ గెలవాలంటే, ఈ రెండు మ్యాచ్‌లను గెలవాలి. సిరీస్‌ను డ్రా చేసుకోవాలంటే, భారత్ ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంతో పాటు ఒక మ్యాచ్‌ను గెలవాల్సి ఉంటుంది.
