Balloon Explosion: కళ్ల ముందు కనిపించిన మృత్యువు.. లిఫ్ట్‌లో పేలిన గ్యాస్ బెలూన్లు.. (వీడియో)
- లిఫ్ట్‌లో పేలిన గ్యాస్ బెలూన్లు
- ముంబైలో షాకింగ్ ఘటన
- యువకుడు, యువతి ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ లోని లిఫ్ట్‌లో అకస్మాత్తుగా బెలూన్స్ పేలిపోయాయి. ఈ భయానక దృశ్యం లిఫ్ట్‌లోని సీసీటీవీలో రికార్డ్ కాగా సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, తెల్లటి చొక్కా ధరించిన ఒక మహిళ, ఒక చిన్న ట్రాలీ బ్యాగ్ పట్టుకుని, మొదట లిఫ్ట్‌లోకి ప్రవేశించింది. ఆమె వెళ్లాల్సిన ఫ్లోర్ కోసం బటన్‌ను నొక్కింది. ఆమె వెనుక, డజనుకు పైగా బెలూన్స్ తో ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. బెలూన్ పట్టుకున్న వ్యక్తి లోపలికి వచ్చి ఒక మూలలో నిలబడబోతుండగా, లిఫ్ట్ లోపల బెలూన్స్ బాంబులు పేలినట్లు పేలిపోయాయి. లిఫ్ట్ అంతటా భారీ మంటలు చెలరేగాయి.
Also Read:YS Jagan: పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారు.. ఫ్లెక్సీలు మాక్కూడా కట్టొచ్చు!
Also Read
ఒక్కసారిగా ఆ యువతీ యువకులకు కళ్ల ముందు మృత్యువు కనిపించినట్లైంది. అయితే అప్పటికీ డోర్స్ క్లోజ్ కాకపోవడంతో అందరూ లిఫ్ట్ నుండి బయటకు పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది. బెలూన్లు మోస్తున్న వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోయి నేలపై పడిపోయాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఆ యువకుడు, యువతి ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. బెలూన్ విక్రేతపై కూడా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అతను బెలూన్లకు ఏ రకమైన వాయువు నింపాడో తెలియదు. హీలియం బెలూన్లు మండేవి కావు, కానీ హైడ్రోజన్ బెలూన్లు మండే స్వభావం కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
📍 Mumbai, Maharashtra: Gas-filled balloons caught fire and exploded inside a residential lift in Goregaon. CCTV shows sudden flames, panic, and a narrow escape. Two injured. Safety ignored, danger invited. pic.twitter.com/I6NHrzEvpF
— Deadly Kalesh (@Deadlykalesh) February 4, 2026
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!