Site icon NTV Telugu

Garlic Price Hike : కొండేక్కిన వెల్లుల్లి ధరలు.. కిలో ఎంతంటే?

Garlic Markets

Garlic Markets

సామాన్యులకు కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. రోజురోజుకు ధరలు భారీగా పెరుగుతున్నాయి.. మొన్నటివరకు ఉల్లిపాయ ధరలు ఘాటేక్కించాయి.. ఇప్పుడు వెల్లుల్లి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. టమోటా ధరలు కూడా బాగా తగ్గినట్లు తెలుస్తుంది.. అయితే ప్రస్తుతం అల్లం, వెల్లుల్లి రేట్లు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.. ఈరోజుల్లో మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి..

ఇప్పుడు కిలో 500పైనే పలుకుతోంది. దాంతో.. వంటి గది నుంచి వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి నెలకొంది. కొద్దిరోజుల క్రితం.. 300 వరకు ఉన్న వెల్లుల్లి ధర.. రెండు వారాల్లోనే భారీగా పెరిగింది.. గత ఏడాది డిసెంబర్ లో ధరలు దాదాపు రూ. 400 లకు చేరింది.. ఇప్పుడు ఇంకాస్త ధర పలుకుతుంది.. ఏకంగా కిలో 500కి ఎగబాకింది. అల్లం ధర కూడా వెల్లుల్లితోపాటే పరుగులు పెడుతోంది. ఇప్పటికే కిలో అల్లం ధర 300 క్రాస్‌ అవుతోంది. స్థానికంగా సాగు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేస్తున్నారు.. దాంతో ధరలకు రెక్కలు వచ్చాయి..

పట్టణాలు, గ్రామాల్లో వీధుల్లో తిరిగే వ్యాపారులు ప్రస్తుతం ధరల పెరుగుదల కారణంగా ఎక్కడా కనిపించడం లేదు. వాహనాలకు మైకులు ఏర్పాటు చేసుకొని రూ.100 కిలో అల్లం, కిలో ఎల్లిగడ్డ అంటూ ప్రచారం చేసుకుంటూ విక్రయాలు సాగించేవారు. కానీ, ధరల మంట కారణంగా వ్యాపారులు కూడా ముందుకురావటం లేదు.. ఈ ఏడాది పంట కూడా సరిగ్గా లేక పోవడంతోనే ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.. ఇంకా ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు..

Exit mobile version