Minor Girl Gangraped Case: అస్సాంలోని డింగ్ లో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితుల్లో ఒకరు శనివారం తెల్లవారుజామున మరణించారు. అందిన సమాచారం ప్రకారం., పోలీసు బృందం అతన్ని క్రైమ్ సీన్ రిక్రియేషన్ కోసం తీసుకెళ్లినప్పుడు నిందితుడు చెరువులో దూకాడు. దాంతో అతడు నీట మునిగి చనిపోయాడు. అతని చేతులకు సంకెళ్లు ఉండడంతో నీటిలో నుండి బయటకు రాలేక ఊపిరి ఆడక చనిపోయాడు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనకు సంబంధించి తఫ్జుల్ ఇస్లామ్ ను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అతడిని పోలీసుల సమక్షంలో శనివారం సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితుడు పోలీసు కస్టడీ నుండి తప్పించుకొని చెరువులోకి దూకాడు. వెంటనే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు పోలిసులు. అయినా కానీ సుమారు రెండు గంటల తర్వాత అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Tirupati Crime: తిరుపతిలో దారుణం.. అనాథ బాలికపై అఘాయిత్యం.. ఆపై..!
గురువారం నాడు 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత, అస్సాంలోని నాగావ్ జిల్లాలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి సంఘం, వివిధ సంస్థలు ఆ ప్రాంతంలో బంద్ కు పిలుపునిచ్చాయి. నివేదిక ప్రకారం, మైనర్ బాలిక పాక్షిక అపస్మారక స్థితిలో చెరువు సమీపంలో పడి ఉంది. ఆమె సైకిల్ కూడా చెరువు సమీపంలో ఉంది. స్థానికులు కొందరు బాలికను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
#WATCH | The body of the prime accused of the Dhing gang rape incident in Assam's Nagaon district, Tafazul Islam recovered from a pond. The police had earlier arrested him in connection with the case.
"When a police team took him last night to the spot for investigation where… pic.twitter.com/ow29EJ37j7
— ANI (@ANI) August 24, 2024
