Site icon NTV Telugu

Hyderabad: చిన్న పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త.. కొండాపూర్ లో పిల్లలను అపహరించే గ్యాంగ్ కలకలం..

Kondapur

Kondapur

చిన్న పిల్లల తల్లిదండ్రులు ఆదమరిచి ఉంటే అంతే సంగతులు. ఓ ముఠా పిల్లలే టార్గెట్ గా నగరంలో సంచరిస్తోంది. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఓ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో వాచ్మెన్ పిల్లలను టార్గెట్ చేసుకోనీ ఎత్తుకెళ్లేందుకు రెడీ అయ్యింది ముఠా. అప్రమత్తమైన స్థానికులు ముఠాను పట్టుకుని దేహశుద్ధి చేశారు. పిల్లలను అపహరించే గ్యాంగుకు దేహశుద్ధి చేశారు. కాగా ముటా సభ్యులలో ముగ్గురిలో ఇద్దరు ఆటోలో తప్పించుకోగా ఒకరు పట్టుబడ్డారు. పట్టుకున్న మహిళను స్తంభానికి కట్టేసి కొట్టి గచ్చిబౌలి పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెడుతూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Exit mobile version