Site icon NTV Telugu

Ganesh Immersion: గణేష్ నిమజ్జనాలకు నగరంలో 74 కొలనులు రెడీ

Ganesh 1 (1)

Ganesh 1 (1)

గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో నిమజ్జనానికి 74 కొలనులను సిద్దం చేస్తున్నారు అధికారులు. కొన్ని చోట్ల చెరువులు, కుంటలతో పాటుగా ప్రత్యేకంగా తాత్కాలికంగా  కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశారు. శాశ్వతంగా జిహెచ్ఎంసి ద్వారా 28 ప్రాంతాల్లో నిమజ్జన కొలనులను నిర్మించిన విషయం తెలిసిందే. వాటిని వినియోగించుకొనుటకు చిన్న, చిన్న మరమ్మత్తులు చేసి సిద్ధంగా ఉంచారు. ఈ ఏడాది నూతనంగా ప్రిఫ్యాబ్రికేటెడ్ ఫైబర్ రెయిన్ ఫోర్స్ డ్ ప్లాస్టిక్ (ఎస్.ఆర్.పి) 1.35 నుండి 1.50 మీటర్ల  లోతుతో 30×10 పొడవు గల పోర్టబుల్ బే కృత్రిమ కొలనులను 24 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశారు.. మరో 22 ప్రదేశాలలో గుర్తించి ఎక్స్ వేటర్ (డ్రగ్ పాండ్, త్రవ్వకం చేసి తాత్కాలికంగా కొలను ఏర్పాటు చేశారు. 

ఎల్బీనగర్ జోన్ లో 4 కృత్రిమ కొలనులు

1 ఏ.ఎస్ రావు నగర్, ఎగ్జిబిషన్ గ్రౌండ్
2.సచివాలయ నగర్ ఆఫీసర్స్ కాలని వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్
3.ఏం అర్ ఓ ఆఫీస్ హయత్ నగర్
4. మున్సిపల్ ఆఫీస్ వెనుక గల ప్రభుత్వ కళాశాల
 
చార్మినార్ జోన్ లో 3కృత్రిమ కొలనులు
1. కృష్ణ తులసి నగర్ పార్కు
2. రియసత్ నగర్ శివాలయ గ్రౌండ్
3. శ్రీ లక్ష్మీ ఈశ్వర ప్లే గ్రౌండ్ జంగంమెట్

ఖైరతాబాద్ బాద్ జోన్ లో 5
1.100 ఫీట్ రోడ్డు యస్ బి ఎ గార్డెన్
2. నిజాం కాలేజీ ప్లే గ్రౌండ్
3. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్
4. అమీర్ పేట్ ప్లే గ్రౌండ్
5. ఎన్.బి.టి నగర్ .

శేరిలింగంపల్లి జోన్ లో 3 
1. ఐ మ్యాక్స్ థియేటర్ వెనుక
2.పి.జె.ఆర్ స్టేడియం చందానగర్
3. పటాన్ చెరు సాకి చెరువు.

కూకట్ పల్లి జోన్  లో 3

1.చిత్తరమ్మ టెంపుల్ వివేక నంద నగర్
2. హెచ్.ఎం.టి ఓపెన్ ప్లేస్
3. కౌకూర్ పార్క్, వాటర్ ట్యాంక్ దగ్గర, 

సికింద్రాబాద్ జోన్ లో 4
1.ఆజాద్ నగర్ అంబర్ పేట్ స్టేడియంలో రెండు కొలనులు
2. ఎన్.టి.ఆర్ స్టేడియంలో రెండు కొలనులు
3. చిలకలగూడ మున్సిపల్ గ్రౌండ్, మారేడ్ పల్లి ప్లే  గ్రౌండ్

ఎక్సివేషన్ కృత్రిమ కొలను లు తాత్కాలిక తవ్వకంతో నిమజ్జన కొలనులను  23 ప్రదేశాలలో ఏర్పాటు చేస్తారు. అవసరాన్ని బట్టి కూడా అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఎల్బీనగర్ జోన్ ..సర్కిల్ 2లో  దేవేందర్ నగర్ రోడ్డు, సర్కిల్ 4 వనష్టలి పురం స్విమ్మింగ్ పూల్ ప్రక్కన క్రికెట్ గ్రౌండ్ , హుడా భారతీ నగర్ , 5 సర్కిల్ లో సరూర్ నగర్ ఎన్.టి.ఆర్ నగర్ కూరగాయల మార్కెట్…చార్మినార్ జోన్ లో 5 ప్రదేశాలలో  6వ సర్కిల్ లో ఏకలవ్య గ్రౌండ్, 7వ సర్కిల్ లో గౌలి పూర బతుకమ్మ బావి , వైశాలి నగర్ కామన్ చాంపా పెట్ మెయిన్ రోడ్డు, 11వ సర్కిల్ లో మైలార్ దేవలపల్లి నర్సబాయి కుంట.సాయి భవాని ఎంకేవే , ఖైరతాబాద్ జోన్ లో సర్కిల్ 12లో పి వి అర్ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ 54 , చింతల్ బస్తీ రామ్ లీలా గ్రౌండ్, అన్నపూర్ణ టెంపుల్ గుడిమల్కపూర్, , సర్కిల్ 17లో సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్,  సర్కిల్ 18లో సక్కుబాయి లే అవుట్ షేక్ పెట్ ఏర్పాటు చేస్తారు.

శేరిలింగంపల్లి జోన్ లో 20 వ సర్కిల్ లో గోపాల్ పల్లి రోడ్డు రంగనాయక టెంపుల్ ఎదురుగా,, 21వ  సర్కిల్ లో రెగుల కుంట చెరువు, 22వ  సర్కిల్ లో పటాన్ చెరువు  సాకి చెరువు..కూకట్ పల్లి జోన్ లో సర్కిల్ 25లో హెచ్ ఏం టి ఓపెన్ గ్రౌండ్, కుతుబుల్లపూర్ మునిసిపల్ ఆఫీస్ దగ్గర, సర్కిల్ 26లో హెచ్ ఏం టి ఓపెన్ ప్లేస్ (ఇ యస్ ఐ hospital ప్రక్కన )  సికింద్రాబాద్ జోన్ లో  15వ సర్కిల్ లో ఎన్ టి ఆర్ స్టేడియం, 16వ వార్డులో  అంబర్ పెట్ డంపింగ్ యార్డు, 29 వ సర్కిల్ లో చిలకలగూడ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేస్తారు.

శాశ్వత నిమజ్జన కొలనుల వివరాలు: 
ఎల్బీనగర్ నగర్ జోన్ లో  5..చర్లపల్లి, కాప్రా చెరువులో, నల్ల చెరువు, నాగోల్ లేక్, మన్సురాబాద్  పెద్ద చెరువు,  
చార్మినార్ జోన్ లో నర్సబాయి కుంట,  పాటి కుంట,  రాజన్న భావి, నెక్నాంపూర్,  ఖైరతాబాద్ నెక్లెస్ రోడ్డు,  శేరిలింగంపల్లి జోన్ లో  8,  ప్రదేశాలలో దుర్గం చెరువు, మల్కం చెరువు, నల్లగండ్ల చెరువు, గోపి చెరువు, గంగారాం చెరువు,  ఖైదమ్మ కుంట, గురునాధం లేక్, రాయ సముద్రం కూకట్ పల్లి జోన్ లో 7  ప్రదేశాల లో  ముళ్లకత్వ చెరువు, ఐ డి ఎల్, బాలాజీ నగర్ మూసాపేట్,  బోయిన్ చెరువు, ప్రగతి నగర్ ఆల్విన్, కాలనీ హైదర్ నగర్,  లింగం చెరువు  కొత్త చెరువు,  వెన్నెల గడ్డ లేక్,  సికింద్రాబాద్ జోన్ లో 3   సంజీవయ్య పార్క్, సఫిల్ గూడ, బడ చెరువు  మొత్తం 28  నిమజ్జన కొలనులను మరమ్మత్తులు చేస్తూ సిద్దం చేశారు.

Read Also: Monkeys Death: ఒడిశాలో 10 కోతుల మృతి.. ఇద్దరు ఏపీ వాసుల అరెస్ట్

Exit mobile version