Site icon NTV Telugu

Gandipet : వందేళ్ల గండిపేట్ కాండూట్‌కు మరమ్మతులకు సిద్ధమైన జలమండలి

Gandipet

Gandipet

Gandipet : వందేళ్ల గండిపేట్ కాండూట్‌కు మరమ్మతులకు జలమండలి సిద్ధమైంది. కెమికల్ ట్రీట్‌మెంట్ పద్ధతి ద్వారా రిపేర్ చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. షట్ డౌన్ లేకుండానే మరమ్మతు పనులు కొనసాగనున్నాయి. పనుల్ని ఎండీ అశోక్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల నుంచి కాండూట్ కు లీకేజీ సమస్య ఉందని, ప్రజలకు సరఫరాలో ఇబ్బంది వస్తుందని పనుల వాయిదా వేస్తు్న్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో చారిత్రాత్మక గండిపేట్ కాండూట్ ను పదేళ్లుగా వేధిస్తున్న లీకేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు. లీకేజీకి చెక్ పెట్టేందుకు జలమండలి నిర్ణయించుకుంది. కాండూట్‌కు ఏర్పడిన లీకేజీని అరికట్టేందుకు మరమ్మతు పనులు చేపడుతోందని తెలిపారు.

J-K Terror Attacks: జమ్మూలో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఆర్మీ కొత్త వ్యూహం..

గండిపేట్ కాండూట్ కి గత 10 సంవత్సరాల నుంచి గండిపేట్, కోకాపేట్, మణికొండ, సీబీఐటీ కాళాశాల, పుప్పాల గూడ, జానకీ నగర్, కౌసర్ కాలనీ, ఎంఈఎస్ క్యాంపస్ తదితర ప్రాంతాల్లో తీవ్ర లీకేజీలు ఏర్పడ్డాయి.. ఈ లీకేజీలను అరికట్టడానికి మరమ్మతులు చేపడితే.. నీటి సరఫరాలో నెల రోజుల పాటు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఈ పనుల్ని ఎప్పటి నుండో వాయిదా వేస్తూ వస్తున్నారు.. నీటి సరఫరాకు ఆటంకం కాకుండా.. రిపేర్లు చేసే టెక్నాలజీలను అన్వేషించినట్లు ఆయన తెలిపారు. జర్మన్ టెక్నాలజీతో సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా లీకేజీలు అరికట్టడానికి చెన్నై కంపెనీ ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. 40 రోజుల కింద ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్ వద్ద కాండూట్ కి 10 మీటర్ల మేరకు గ్రౌటింగ్ ద్వారా మరమ్మతులు ప్రయోగాత్మకంగా చేపట్టి.. విజయవంతంగా పూర్తి, అదే తరహాలో మిగతా ప్రాంతాల్లోనూ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Vizag Honey Trap Case: హనీట్రాప్ కేసు.. కీలక ఆధారాలు స్వాధీనం

Exit mobile version