NTV Telugu Site icon

Gandhi Jayanti 2024: గాంధీని ‘జాతిపిత’ అని ఎందుకు అంటారు.? గాంధీ జయంతికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు!

Gandhi Jayanti 2024

Gandhi Jayanti 2024

Gandhi Jayanti 2024: మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ.. సాధారణంగా మహాత్మా గాంధీ లేదా బాపు అని మనం పిలుచుకుంటాము. ఆయన గుజరాత్‌ లోని పోర్‌బందర్‌లో 1869 అక్టోబర్ 2న జన్మించారు. గాంధీజీ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో గొప్ప నాయకుడు, అహింస సూత్రం ఆధారంగా దేశానికి స్వాతంత్ర సాధించడంలో ముఖ్యమైన కృషి చేశారు. దాంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న ఆయన జయంతిని గాంధీ జయంతిగా జరుపుకుంటారు. గాంధీజీ ప్రాథమిక విద్యాభ్యాసం పోర్‌బందర్, రాజ్‌కోట్‌ లలో జరిగింది. ఆ తర్వాత ఇంగ్లండ్ వెళ్లి అక్కడ న్యాయశాస్త్రం అభ్యసించాడు. అతను 1891లో బారిస్టర్ డిగ్రీని పొందిన తరువాత భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలం న్యాయశాస్త్రంలో సేవలను అందించాడు. చట్టపరమైన కేసుకు సంబంధించి 1893లో దక్షిణాఫ్రికాకు వెళ్లిన తర్వాత, అతను అక్కడ జాతి వివక్షను ఎదుర్కొన్నాడు. ఇది సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి అతన్ని ప్రేరేపించింది.

Iran Israel War: విజయం దగ్గర్లోనే ఉంది.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!

మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం సత్యాగ్రహం, ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, ఇంకా దండి మార్చ్ వంటి అనేక ముఖ్యమైన ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆయన ఎల్లప్పుడూ తన ఉద్యమానికి అహింస మార్గాన్ని ఎన్నుకున్నాడు. అలాగే హిందూ-ముస్లిం ఐక్యతను పెంపొందించడానికి నిరంతరం కృషి చేశాడు. స్వాతంత్య్రానంతరం గాంధీజీ సామాజిక, ఆర్థిక సంస్కరణల కోసం కృషి చేస్తూనే ఉన్నారు. ఆయన శాంతి, సామరస్యాన్ని పెంపొందించడానికి అనేక ప్రయత్నాలు చేసాడు. అలాగే సత్యం, నిగ్రహం, అహింస మార్గాన్ని అనుసరించేలా ప్రజలను ప్రేరేపించాడు.

Israel-Iran War: భారీ మూల్యం చెల్లించక తప్పదు.. ఇరాన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని మాస్ హెచ్చరిక!

మహాత్మా గాంధీ జీవితం సరళతకు ప్రతీక. అతను ఎల్లప్పుడూ సాధారణ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అందుకనే ధోతి ధరించి ఆశ్రమంలో నివసించడం ద్వారా సాదాసీదా జీవితం గడిపారు. ఈ కారణంగా ప్రజలు ఆయనను ‘బాపు’ అని ముద్దుగా పిలుచుకోవడం ప్రారంభించారు. ఇకపోతే ., మహాత్మా గాంధీకి ‘జాతి పితామహుడు’ గౌరవాన్ని అందించిన మొదటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. గాంధీజీ నాయకత్వానికి, దేశాన్ని ఏకం చేసినందుకు గానూ ఆయనకు ఈ బిరుదు ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ‘జాతి పితామహుడు’గా గౌరవించబడ్డారు.

Show comments