Site icon NTV Telugu

Friday : గాంధీకి ఆ వారంతో బంధం.. కారణం ఇదీ..

Untitled 4

Untitled 4

Gandhi Jayanti: రోజుకి కొన్ని వేల మంది పుడుతుంటారు. చనిపోతుంటారు. మరణించి కూడా బ్రతికుండేవాళ్లు నూటికో కోటికో ఒకరుంటారు. వాళ్ళే ఆమరజీవులు. చిరకాలం బ్రతికుండే చిరంజీవులు. అలాంటి వారిలో ఒకరు మహాత్మా గాంధీ. భారత దేశంలో గుజరాత్ లోని పోర్‌బందర్‌లో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు గాంధీజీ. ఈయన పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. గాంధీజీ 1869 అక్టోబర్ 2వ తేదీన జన్మించారు. ఈయన పుట్టిన రోజుని ప్రపంచవ్యాప్తంగా “అంతర్జాతీయ అహింసా దినోత్సవం”గా జరుపుకుంటారు. అహింస అయన ఆయుధం. నాకు ఒక కన్ను పోయిన పర్వాలేదు ఇతరులకి రెండుకళ్ళూ పోవాలి అనుకునే మనుషులున్న
ఈ సమాజంలో గాంధీజీ ఒక మాణిక్యం.

Read also:Rudraksha: రుద్రాక్ష అంటే ఏమిటి? ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

ఒకసారి గాంధీజీ రైలు ఎక్కుతుండాగా ఆయన ఒక షూ కింద పడిపోయింది. వెంటనే ఆయన రెండో షూ కూడా కిందకి విసిరేశారు. తోటి ప్రయాణికుడు ఇలా ఎందుకు చేసావు అని గాంధీజీని అడిగారు అప్పుడు గాంధీజీ ఎలాగో నేను ఒక షూ పోగొట్టుకున్న ఇక రెండో షూ నా దగ్గర ఉన్న ఏం ప్రయోజనము ఉండదు. అందుకే ఆ రెండో షూ కూడా కిందకి వేసాను. ఇప్పుడు ఆ షూ ఎవరికైనా దొరికితే రెండూ ఉన్నాయి కనుక ఉపయోగపడతాయి అన్నారంట. ఇక గాంధీజీకి శుక్రవారానికి ఓ అనుభందం ఉంది. ఆ బంధం మరేమిటో కాదు.. మనదేశానికి శుక్రవారం స్వాతంత్రం వచ్చింది, గాంధీజీ పుట్టింది, మరణించింది కూడా శుక్రవారం. అందుకే గాంధీజీకి శుక్రవారానికి బంధం ఉందని అంటారు చాలామంది.

Exit mobile version