NTV Telugu Site icon

Rajiv Gandhi : రాజీవ్ గాంధీ వర్ధంతి..నివాళులు అర్పించిన గాంధీ కుటుంబం

Mallikarjuna Kharge,

Mallikarjuna Kharge,

Rajiv Gandhi : నేడు రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా రాజీవ్ గాంధీకి కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. గాంధీ కుటుంబం మొత్తం ఢిల్లీలోని వీర్ భూమికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తనయుడు, మాజీ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా నివాళులర్పించారు.

రాజీవ్ గాంధీకి నివాళులర్పించేందుకు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి వచ్చారు. రాజీవ్ గాంధీ భారతదేశానికి ఏడవ ప్రధానమంత్రి. ఆయ‌న‌ 1984 నుంచి 1989 వరకు భార‌త ప్రధానమంత్రి పదవిని నిర్వహించారు. మాజీ ప్రధానిని 1991లో ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) హత్య చేసింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు.