Gandeevadhari Arjuna : ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున.భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ మూవీ ని డైరెక్ట్ చేసారు.ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.. అలాగే నాజర్, విద్యా రామన్, వినయ్ రాయ్, అభినవ్ గోమటం మరియు రవి వర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.స్పై యాక్షన్ కథకు అంతర్లీనంగా గ్లోబల్ వార్మింగ్, మెడికల్ వే స్టేజీ పాయింట్ ను టచ్ చేస్తూ గాండీవధారి అర్జున కథ ను రాసుకున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఈ రొటీన్ కథకు తన స్క్రీన్‌ప్లే మ్యాజిక్ తో హాలీవుడ్ టచ్ ఇస్తూ ప్రేక్షకుల్ని మెప్పించాలని భావించాడు.అలాగే ఈ సినిమా ను లండన్ బ్యాక్‌డ్రాప్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ల తో దర్శకుడు తెరకెక్కించాడు.. అయితే సినిమాలో బలమైన ఎమోషన్ ఎక్కడ కనిపించలేదు.
అర్జున్ అనే ఏజెంట్ పాత్రకు వరుణ్‌తేజ్ పర్‌ఫెక్ట్ యాప్ట్ గా అయితే నిలిచాడు. అతడి పై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగున్నాయి. ఏజెంట్‌తో పోలిస్తే సాక్షి వైద్యకు ఈ సినిమా లో మంచి పాత్ర దక్కింది. ఐరా క్యారెక్టర్ లో ఆమె యాక్టింగ్ అదరగొట్టింది.విలన్ పాత్ర లో వినయ్ రాయ్ ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. కానీ అతడి క్యారెక్టర్ డిజైనింగ్ లో కొత్తదనం కనిపించలేదు.అయితే థియేటర్ లో అంతగా మెప్పించలేకపోయినా ఈ మూవీ ఓటీటీ లో విడుదల కాబోతుంది.బుధవారం (సెప్టెంబర్ 20) ఈ మూవీ ఓటీటీ విడుదల తేదిని మేకర్స్ రివీల్ చేశారు.గాండీవధారి అర్జున సినిమా సెప్టెంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి తెలుగు వెర్షన్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రానుంది…మిగిలిన భాషల గురించి ఈ ఓటీటీ సంస్థ ఇంకా ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..