NTV Telugu Site icon

Game Changer : ‘గేమ్ చేంజర్’ షూటింగ్ అప్డేట్ వైరల్..

Whatsapp Image 2024 05 17 At 7.18.03 Am

Whatsapp Image 2024 05 17 At 7.18.03 Am

Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గ నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రాంచరణ్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్లు సమాచారం.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన పలు కారణాల వల్ల  కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది.షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకుండా పోయింది.దీనితో తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ‘గేమ్‌చేంజర్‌’ సినిమా తెరకెక్కుతుంది. దర్శకుడు శంకర్‌ ‘భారతీయుడు 2’ సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది .అయితే, ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ లో దర్శకుడు శంకర్‌ స్పీడ్ పెంచారు.ఈ సినిమాలో సునీల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇటీవలే ఆయన నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరించారు.తరువాత షెడ్యూల్‌ ఈ నెలాఖరు నుంచి మొదలు కానుంది.ఈ షెడ్యూల్ లో రాంచరణ్ లేని సన్నివేశాలను పూర్తి చేస్తారని సమాచారం.