NTV Telugu Site icon

Game Changer : ఫైనల్ స్టేజ్ కు గేమ్ చేంజర్ షూటింగ్.. మరి రిలీజ్ ఎప్పుడంటే..?

Whatsapp Image 2024 05 04 At 7.46.02 Am

Whatsapp Image 2024 05 04 At 7.46.02 Am

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి చాలా కాలమే అయిన ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు.ఆర్ఆర్ఆర్ సినిమాతో రాంచరణ్ గ్లోబల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ప్రపంచ వ్యాప్తంగా రాంచరణ్ ఫ్యాన్స్ తన తరువాత సినిమాకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గరినుంచి అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.దర్శకుడు శంకర్ కమల్ హాసన్ తో ఇండియాన్ 2 పూర్తి చేయాల్సి రావడంతో “గేమ్ చేంజర్” షూటింగ్ ఆలస్యం అయింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.’ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చినట్లు సమాచారం.ప్రస్తుతం చెన్నైలో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.ఇందులో రామ్‌చరణ్‌తో పాటు చిత్ర ప్రధాన తారాగణం కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్‌ డ్యూయల్ రోల్ చేసున్నట్లు సమాచారం.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి కీలక పాత్ర పోషిస్తుంది.అలాగే ఈ సినిమాలో సముద్రఖని, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌ మరియు నవీన్‌చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు .ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లుగా నిర్మాత దిల్ రాజు తెలిపారు.అయితే త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు .