గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఎన్నో రోజులు అయ్యింది.. కానీ ఇప్పటికి సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. ఇక ఈ సినిమా ఆలస్యం కావడంతో ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది.. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ పై మరో వార్త వైరల్ అవుతుంది..
ఈ సినిమా షూటింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదని అందరికీ తెలిసిందే.. డైరెక్టర్ శంకర్ ఈ సినిమా కన్నా ముందు ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు.. దాంతో చరణ్ మూవీ విడుదల వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది.. ఈ ఏడాది డిసెంబర్ లేదా 2025 సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు రావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు… కొన్ని నెలల క్రితం సెప్టెంబర్ చివరి వారంలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. మరల ఇప్పుడు డిసెంబర్‌లో ఈ మూవీ విడుదల ఉండొచ్చని తెలుస్తోంది.
అయితే ఎన్టీఆర్ దేవర మొదట ఏప్రిల్ 5న రిలీజ్ ప్రకటించిన టీమ్ మళ్లీ డేట్ మార్చి అక్టోబర్ 10 కి విడుదల తేదీ అనౌన్స్ చేసింది.. ఆ తర్వాత వరుసగా నాగార్జున, వెంకటేష్, చిరంజీవి సినిమాలు కూడా వరుసగా లైన్ లో ఉండంతో సినిమా విడుదల తేదీ వాయిదా పడబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరగా షూటింగ్ పూర్తిచేసుకుని డిసెంబర్ 2024 కి కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై రెండు నెలల క్రితం శంకర్, రామ్ చరణ్, దిల్ రాజు మీటింగ్ అయ్యారని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్‌కి మరో 4,5 నెలల సమయం పడుతుంది.. 2024 డిసెంబర్‌లో విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.. అప్పటికి చేస్తారో లేదో చూడాలి..
