NTV Telugu Site icon

Gaami : అదరగొట్టిన విశ్వక్ మూవీ..’గామి’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Gami

Gami

టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన మూవీ గామి.. చాందిని హీరోయిన్ గా నటించింది.. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించాడు విశ్వక్..దర్శకుడు విద్యాధర్ కటిగ ఈ సినిమాను చాలా చక్కగా తెరాకెక్కించారు.. ఈ చిత్రం కోసం అతడు ఆరేళ్లుగా పని చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ శివరాత్రి కానుకగా విడుదల అయ్యింది.. మొదటి షో తోనే మంచి టాక్ ను అందుకుంది..

ఇక టీజర్, ట్రైలర్స్ గామి సినిమా అంచనాలు పెంచగా మొదటి షో నుంచే ప్రేక్షకులని మెప్పించింది. ఓ సరికొత్త ప్రయోగాత్మక చిత్రంగా, హాలీవుడ్ విజువల్స్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది ఈ సినిమా. ఈ రేంజ్ విజువల్స్ సినిమాని తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించారు.. ఈ సినిమా ప్రస్తుతం వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. తాజాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు..

ఇప్పటివరకు ఈ సినిమా మొదటి రోజే 9.07 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక అమెరికాలో 250K డాలర్స్ పైగా కలెక్ట్ చేసి 1 మిలియన్ డాలర్స్ కి దూసుకుపోతుంది.. ఈరోజు, రేపు వీకెండ్ కావడంతో వసూళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది..

Show comments