NTV Telugu Site icon

G20 Dinner Menu: జీ20 డిన్నర్‌లో భారతీయ రుచులు.. వంటకాల పూర్తి జాబితా ఇదే

G20 Dinne

G20 Dinne

G20 Dinner Menu: జీ20 సదస్సు వేదికగా దేశాధినేతలు, ఇతర ప్రతినిధుల కోసం శనివారం ఏర్పాటు చేయనున్న విందు కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక వంటకాల జాబితాను సిద్ధం చేశారు. ఈ విందు కోసం తయారు చేయబడిన మెనూలో భారతదేశంలోని విశిష్ట వంటకాలు ఉన్నాయి. ఒక లగ్జరీ హోటల్ గ్రూప్ సీనియర్ మేనేజర్లు, సిబ్బంది రెండు రోజుల పాటు జరుగుతున్న సదస్సు కోసం భారత్ మండపంలో విందు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన ప్రత్యేక వెండి సామాగ్రిలో అధికారిక విందును ఏర్పాటు చేయనున్నట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి.

భారతదేశంలో ఈ (వర్షాకాలం) సీజన్‌లో తినే వంటకాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. మెనూలో మిల్లెట్ ఆధారిత వంటకాలు కూడా ఉంటాయి. మెనూలో చేర్చబడిన వంటకాల గురించి అధికారులు ఖచ్చితమైన వివరాలు ఇవ్వలేదు. ఇది భారతీయ వంటకాల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని వారు భావిస్తున్నారు. శిఖరాగ్ర సదస్సు మొదటి రోజు ముగిసిన తర్వాత రాష్ట్రపతి ముర్ము భారత్ మండపంలో ఘనంగా విందును ఏర్పాటు చేస్తారు.

Read Also:African Union: జీ-20 సమావేశాల్లో కీలక పరిణామం.. ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం

మెనూ వివరాలు పబ్లిక్‌గా లేవు. కానీ సదస్సుకు వచ్చిన దేశాధినేతలకు వడ్డించే భారతీయ వంటకాల రుచి.. వారికి చిరకాలం గుర్తుండిపోతుంది. గులాబ్ జామూన్, రస్మలై, జిలేబీ వంటి పలు రకాల స్వీట్లను అందించనున్నారు. వంటకాలను అందించే సిబ్బంది కూడా ప్రత్యేక దుస్తులను ధరిస్తారు. మెనూలో భారత ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన లేదు.

జైపూర్‌కు చెందిన ఒక మెటల్ పాత్రల తయారీ సంస్థ మంగళవారం మాట్లాడుతూ.. అనేక విలాసవంతమైన హోటళ్లు తమ సంస్థల్లో బస చేసే విదేశీ ప్రతినిధులు ఉపయోగించే వెండి వస్తువులు, ఇతర పాత్రలను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపింది. ఆ సంస్థ మంగళవారం కొన్ని వెండి పాత్రలను మీడియాకు ప్రదర్శించింది. 200 మంది కళాకారులు దాదాపు 15,000 వెండి పాత్రలను సమ్మిట్ కోసం సిద్ధం చేశారని కంపెనీ తెలిపింది. G20 లీడర్స్ సమ్మిట్ శని, ఆదివారాల్లో ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్ – భారత మండపంలో జరుగుతుంది.

Read Also:G20 Summit: భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా చేసిన మోడీ

Show comments