Site icon NTV Telugu

Chicken leg piece: ముక్క కోసం ఆ మహిళ ఎంత పని చేసిందంటే….

Sam (4)

Sam (4)

సోషల్ మీడియోలో వచ్చే వీడియో కొన్ని ఆసక్తి కరంగా, గమ్మత్తుగాను ఉంటాయి. ఇలాంటి వీడియోలు తెగ వైరలవుతుంటాయి. అలాంటే ఒక వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కొందరు పంక్షన్ మటన్ , చికెన్ ముక్కలు కోసం యుద్ధాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల ముక్క వేయలేదని కొట్టుకున్న సందర్భాలు చూసుంటాం. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక వీడియో కనిపించింది. ఈ వీడియో ఒక పెళ్లి వేడుకలో భోజనం చేయడానికి వచ్చిన మహిళకు సంబంధించినది. కానీ వీడియో చూసిన వాళ్లంతా ఒకింత ఆశ్చర్యానికి గురవుతారు.

ఒక మహిళ భోజనం చేసేందుకు టేబుల్‌ ముందు కూర్చుని ఉంది.. డిన్నర్ చేయడానికి వచ్చిన ఆ మహిళ ముందు టేబుల్‌పై ఫుడ్‌ సప్లై చేసి ఉంది. ఇంతలోనే ఆమె అందరినీ ఆశ్చర్యపోయే పనిచేసింది..ఆమె చేసిన ఫన్నీ సీన్‌ చూస్తే అందరూ నోరెళ్ల బెడతారు. చూస్తుంటే.. ఆమె మొదటిసారి ఇలాంటి ఆహారం తింటున్నట్లుగా అనిపిస్తుంది. ఆమె ప్లేట్‌లో వడ్డించిన చికెన్‌ లెగ్‌పీస్‌ తీసుకొని బ్యాగ్‌లో పెట్టేసుకుంది.

మహిళకు బాగా రోస్ట్ చేసిన చికెన్ లెగ్ పీస్ బాగా నచ్చి ఉంటుంది. లేక పోతే.. మళ్లీ ఇంకో పీస్ అడిగేందుకు మోహమాట పడిందో తెలియదు గానీ.. మొత్తానికైతే.. ఆ లెగ్ పీస్ ని టిష్యూ పేపర్ లో చుట్టి తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకుంది. ఇదంతా ఎవరో రికార్డ్‌ చేశారో, లేదంటే సీసీ కెమెరాలో రికార్డైందో తెలియదు గానీ, సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌ అవుతోంది. ఆమె ఎందుకు చేస్తుందో తెలియక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూసిన తర్వాత చాలా మంది, ఆ మహిళ తన ఆహారం మొత్తం తినలేకపోతుందని, అందుకే ఆమె చికెన్ ముక్కను పేపర్‌లో చుట్టి ఇంటికి తీసుకెళ్లిందని చెబుతున్నారు.

Exit mobile version