కూతురి చేతిలో హత్యకు గురైన తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారిణి అంజలి మృతదేహానికి నివాళ్ళు ఆర్పించారు సాంస్కృతిక శాఖ కళాకారులు,డిపీఆర్ఓ రాజేందర్ ప్రసాద్. స్వగ్రామం ఇనుగుర్తి గ్రామంలో అంజలి అంతిమయాత్రలో కళాకారులు, జేఏసీ నాయకులు, కుల సంఘాలనాయకులు పాల్గొన్నారు. తక్షణ సహాయం కింద పదివేల రూపాయలను అంజలి కుటుంబ సభ్యులకు అందచేశారు డీపీఆరోఓ రాజేందర్ ప్రసాద్.. అంజలి మృతదేహానికి నివాళులు అర్పించారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. అంజలి చిన్న కూతురు మనస్విని మాట్లాడుతూ అమ్మను చంపిన ఆ ముగ్గురిని వదలొద్దని ఉరితీయాలని ప్రభుత్వాన్ని కోరింది.
Also Read:Kannappa : కన్నప్ప టీమ్ పై జీఎస్టీ సోదాలు.. మంచు విష్ణు సహా..
అమ్మను చంపిన మా అక్క..శివ, వాళ్ళ తమ్ముడికి ఊరి శిక్షపడాలి.. మాకు న్యాయం చేయాలి.. మా కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలి.. సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు సీతక్క, కొండా సురేఖకు దండంపెడుతున్న.. ఆ ముగ్గురిని వదలొద్దని వేడుకుంది. పోలీసులు కస్టడీలో ఉన్న శివను వదిలేయడం వల్లనే శివ బయటకు వచ్చి ఆమ్మను చంపాడని మనస్విని అరోపించింది. సాంస్కృతికశాఖ కళాకారులు గిద్దె రామనర్సయ్య మాట్లాడుతూ.. హత్యకు గురైన అంజలి కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలి.. అంజలి చిన్న కూతురు మనస్వినిని ప్రభుత్వమే చదివించి..ఇందిరమ్మ ఇళ్లు మంజారు చేయాలి.. అంజలి కుటుంబానికి సాంస్కృతికశాఖ కళాకారుల తరపున తరుపున..5 లక్షల రూపాయల ఇస్తున్నామని తెలిపారు.
Also Read:CM Revanth Reddy: ఐఏఎస్ అధికారులు వారానికి రెండు పాఠశాలలను సందర్శించాలి..
మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
అంజలిని హత్య చేసిన ముగ్గురిని వదిలి పెట్టవద్దన్నారు. అంజలి కుటుంబాన్ని రేవంత్ సర్కార్ అదుకోవాలని కోరారు.. అంజలి చిన్న కూతురు మనస్వినిని ప్రభుత్వమే చదివించాలని విజ్ఞప్తి చేశారు.
