దేశ ఆర్థిక ప్రగతిలో ఎంతో కీలకమైన కేంద్ర బడ్జెట్ 2023-24ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈ బడ్జెట్ యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు ఆశాదీపం అని మంత్రి పేర్కొన్నారు. అయితే కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం కాస్త తక్కువనే చెప్పాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేయగా.. మొత్తంగా చూసుకుంటే కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41, 338 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు కేటాయింపులు ఇలా ఉన్నాయి..
ఏపీ సంస్థలకు కేటాయింపులు..
- సెంట్రల్ యూనివర్సిటీ – రూ. 47 కోట్లు
- పెట్రోలియం యూనివర్సిటీ – రూ. 168 కోట్లు
- విశాఖ స్టీల్ ప్లాంట్ – రూ. 683 కోట్లు
తెలంగాణ సంస్థలకు కేటాయింపులు..
- సింగరేణి – రూ.1,650 కోట్లు
- ఐఐటీ హైదరాబాద్ – 300 కోట్లు
- మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు – రూ. 1,473 కోట్లు
రెండు రాష్ట్రాలకు ఉమ్మడి కేటాయింపులు.
- రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలు – రూ. 37 కోట్లు
- మంగళగిరి, బిబినగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు – రూ. 6,835 కోట్లు
- సాలార్జంగ్ సహా అన్ని మ్యూజియాలకు – రూ. 357 కోట్లు
ఈ గణాంకాలను చూస్తే తెలుగు రాష్ట్రాలకు పెద్దగా కేటాయింపులు జరగలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పేరుని కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రస్తావించలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ వైజాగ్ రైల్వేజోన్‌కు నిధులు కేటాయించలేదు. చాలాకాలంగా ఉన్న డిమాండ్‌ను బడ్జెట్‌లో ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు.
Uttam Kumar Reddy: కేంద్ర బడ్జెట్‌పై ఉత్తమ్ ఫైర్.. ఆ విషయంలో కేసీఆర్ ఫెయిల్
