Site icon NTV Telugu

AP Education Department: జూలై నుంచి ప్రతి పాఠశాలను తనిఖీ చేయనున్న అధికారులు.. ఎందుకంటే?

Ap Education Department

Ap Education Department

జూలై నుంచి పాఠశాలలపై నిత్య పర్యవేక్షణ ఉండనుంది. జూలై నుంచి ప్రతి పాఠశాలలో అధికారులు పర్యటన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అకడమిక్ క్యాలండర్ ప్రకారం సిలబస్ ఫాలో అవుతున్నారా? లేదా? ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన ఎలా చేస్తున్నారనే అంశాలను పరిశీలించనున్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు – పిల్లల సాంకేతిక, విద్యా నైపుణ్యాల స్థాయి ఏ మేరకు ఉంది. స్టూడెంట్ ఎసైన్ బుక్ పై పరిశీలన ఉండనుంది. PM-POSHAN (MDM) అమలు, మధ్యాహ్న భోజన పథకం పాఠశాలల్లో సక్రమంగా అమలు అవుతోందా? అనే అంశాన్ని తనిఖీ చేయనున్నారు.

READ MORE: Shekhar Kammula : రాజమౌళి మాకు ధైర్యం ఇచ్చాడు.. శేఖర్ కమ్ముల కామెంట్స్

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యాయా లేదా? అని అధికారులు ఆరా తీస్తారు. యూనిఫాంలు పంపిణీ జరిగిందా?
పాఠశాలలో శుభ్రత పరిస్థితులు ఎలా ఉన్నాయి? అని పరిశీలిస్తున్నారు. తాగునీరు సౌకర్యాన్ని తనిఖీ చేస్తారు. ప్రతి ఉపాధ్యాయుడు, పాఠశాల సిబ్బంది వీటిపై పూర్తిస్థాయి సమాధానం చెప్పగలిగే విధంగా సిద్ధంగా ఉండాలంటున్న విద్యాశాఖ సూచించింది. విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version