NTV Telugu Site icon

Friday : కర్పూరంతో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది..!

Lakshmi

Lakshmi

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉండాలి.. చేతిలో డబ్బులు మిగలాలి అని లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. కానీ వాటిని సరైన పద్ధతిలో పాటించకపోవడం వల్ల ఫలితాలు లభించకపోగా మరిన్ని కష్టాలు తోడవుతాయి.. అలాంటిది కర్పూరంతో కొన్ని పరిహారాలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి పోతాయని పండితులు చెబుతున్నారు.. ఏం చేయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

శుక్రవారం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తల స్నానం చేసి లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఆ తర్వాత ఐదు కర్పూర బిల్లలను ఎర్రని వస్త్రంలో మూట కట్టి లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు ఉంచాలి. ఆ తర్వాత ఆ మూటకు పూజ చేసి హారతి ఇచ్చి, దూపం వేయాలి.ఈ విధంగా కర్పూరం కట్టిన మూటకు లక్ష్మీదేవికి పూజ చేసిన ఆపై ఆ మూటను తీసుకెళ్లి బీరువాలో డబ్బులు,బంగారం పెట్టే చోట ఎవరికీ తెలియకుండా పెట్టాలి.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు..

ఇలా చెయ్యడం ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయట.. మెరుగవుతాయి.కర్పూరంతో చేసే ఈ పరిహారం కర్మ ఫలితాలను తొలగిపోయేలా చేస్తుంది. ఈ పరిహారం చేసిన తర్వాత కష్టపడకుండా భారం మొత్తం అమ్మవారిపై వేయకుండా మీరు కూడా కష్టపడి పని చేస్తూ ఖర్చులను తగ్గించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.. అంతేకాదు ఈ డబ్బును కేవలం మంచి మార్గంలో మాత్రమేనడుస్తూ మంచి పనులు చేస్తూ డబ్బులు సంపాదించాలి. చెడు మార్గంలో వెళుతూ చెడుగా డబ్బులు సంపాదించేవారి దగ్గర లక్ష్మీ దేవి ఉండదు.. ఇది గుర్తుంచుకోండి..