ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో జగనన్న గోరుముద్ద ఒకటి. అయితే.. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. జగనన్న గోరుముద్దలో భాగంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు ఒకటి చొప్పున మధ్యాహ్నం భోజన సమయంలో విద్యార్థులకు అందిస్తున్నారు. అయితే.. ఇటీవల కొన్ని చోట్ల మధ్యాహ్నం భోజనంలో అందించే గుడ్డు నాణ్యత లేకపోవడం.. పాడైపోయిన గుడ్లు విద్యార్థులకు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో 10 రోజులకు ఒక్కసారి పాఠశాలలకు సరఫరా చేస్తున్న గుడ్లకు బదులుగా వారానికి ఒకసారి గుడ్లను సరఫరా చేయాల్సిందిగా ఆదేశించింద ఏపీ ప్రభుత్వం.
Also Read : AP Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగాలు
కోడిగుడ్ల నాణ్యత చెడిపోకుండా, తాజా గుడ్లు అందించేందుకు వారానికి ఒకసారి కోడిగుడ్లు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. ప్రతి వారం వచ్చే గుడ్లకు నాలుగు రంగుల స్టాంప్ వేస్తారు. అయితే.. గుడ్ల సరఫరాలో అక్రమాలకు తావు లేకుండా.. మొదటి వారం నీలం, రెండో వారం గులాబీ, మూడోవారం ఆకుపచ్చ, నాల్గవ వారం వంగపువ్వు రంగులతో గుడ్లపై స్టాంపింగ్ చేయనున్నారు.