Site icon NTV Telugu

Job Cheating: ఉద్యోగ ప్రయత్నం చేసి.. అలసిపోయిన అమాయకులే వాళ్ల టార్గెట్..

Job

Job

ఉద్యోగం ఇప్పిస్తామంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు. అది కూడా గవర్నమెంట్ ఆఫీసులో కొలవు అంటే ఎగిరి గంతేస్తారు. సరిగ్గా దీన్నే కొంత మంది కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. నిజానికి అలాంటి వాడికే ఉద్యోగానికి టికానా ఉండదు. కానీ ఉద్యోగాలిప్పిస్తామని బురిడీ కొట్టి అమాయకుల దగ్గర డబ్బులు కాజేస్తున్నారు. అలాంటి ఉదంతమే గుంటూరు జిల్లాలో బయటపడింది. ఉద్యోగ ప్రయత్నం చేసి.. చేసి అలసిపోయిన అమాయకులే వాళ్ల టార్గెట్..

Also Read:Hyd Sarogacy: అడ్డదారుల్లో వెళ్తుంటే అడ్డుకోవాల్సిన తల్లే.. కొడుకు, కూతురుతో అక్రమ దందా చేయిస్తూ..

గవర్నమెంట్ ఉద్యోగం, ఔట్ సోర్సింగ్ జాబ్ అంటూ ఎర.. పాపం.. ఆ అమాయకులు వారిని గుడ్డిగా నమ్మేసి.. వారు అడిగినంతా సమర్పించుకుంటారు. ఇక అప్పటి నుంచి అసలు కథ షురూ అవుతుంది. నిజానికి డబ్బు చేతికి వచ్చే వరకు.. ఒక్క రింగ్‌కే ఫోన్ లిఫ్ట్ చేసే కేటుగాళ్లు.. డబ్బులు అందిన తర్వాత మాత్రం.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఫోన్‌‌కు ఆన్సర్ చేసినా.. ఇదిగో అదిగో అంటూ తిప్పంచుకుంటారు..

Also Read:Coolie : ఈ కూలీ కూలి ఎక్కువే.. మాస్ రాంపేజ్.. ఎన్ని వందల కోట్లంటే?

గుంటూరు జిల్లాలోనూ సరిగ్గా ఇలాంటి కేటుగాడే తయారయ్యాడు. అమాయకులైన నిరుద్యోగులను వలలో వేసుకున్నాడు నాగార్జున అనే బ్రోకర్. కలెక్టరేట్‌లో ఉద్యోగాలిప్పిస్తానని బురిడీ కొట్టించాడు. ఒక్కొక్కరి వద్ద దాదాపు రూ. 4 లక్షల వరకు వసూలు చేశాడు. చాలా రోజులు తన చుట్టూ తిప్పించుకుని.. బాధితులు గట్టిగా అడిగే సరికి మరో మోసానికి తెరతీశాడు. ఏకంగా జాయింట్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అపాయింట్‌మెంట్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు.

Also Read:Coolie : ఈ కూలీ కూలి ఎక్కువే.. మాస్ రాంపేజ్.. ఎన్ని వందల కోట్లంటే?

ఈ క్రమంలో నర్సీపట్నంకు చెందిన చింరజీవి, పూర్ణ.. నాగార్జున చేతిలో మోసపోయారు. ఇప్పుడు గుంటూరు జిల్లా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. బాధిత యువకులు గ్రీవెన్స్‌లోఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు చెప్పడంతో మళ్లీ పోలీసులను ఆశ్రయించే పనిలో పడ్డారు. గవర్నమెంట్ ఉద్యోగాల పేరుతో ఎవరు డబ్బులు అడిగినా నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. అలా డబ్బులు అడుగుతున్నారంటే కచ్చితంగా మోసగాళ్లే అయి ఉంటారంటున్నారు. కాబట్టి వారి వలలో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకోవద్దని వార్నింగ్ ఇస్తున్నారు.

Exit mobile version