Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే అతిపెద్ద జీఎస్టీ మోసాల్లో ఒకటిగా భావిస్తున్న రూ.1700 కోట్ల నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) సిండికేట్‌ను విశాఖపట్నం డీజీజీఐ (DGGI) అధికారులు బట్టబయలు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ధంట్ల ఆది రెడ్డి అలియాస్ అంజి రెడ్డిని మే 14, 2026న అధికారులు అరెస్ట్ చేశారు.
అసాధారణ జీఎస్టీ ఫైలింగ్స్, బ్యాంక్ లావాదేవీలపై వచ్చిన సమాచారంతో అధికారులు డిజిటల్ ట్రాకింగ్, ఫీల్డ్ వెరిఫికేషన్లు జరిపారు. ఈ దర్యాప్తులో నిందితుడు ఇతరుల ఆధార్, పాన్ కార్డులను దుర్వినియోగం చేస్తూ, నకిలీ రెంటల్ అగ్రిమెంట్లతో ఏకంగా 92 నకిలీ కంపెనీలను సృష్టించినట్లు తేలింది. ఎలాంటి సరుకు లేదా సేవల సరఫరా లేకుండానే కేవలం నకిలీ ఇన్వాయిస్ల ద్వారా ఈ సిండికేట్ రూ.264 కోట్ల నకిలీ ITC పొందింది, అలాగే రూ.260 కోట్ల ఐటీసీని ఇతరులకు బదిలీ చేసింది. ఈ విధంగా మొత్తం రూ.1700 కోట్ల విలువైన మోసపూరిత లావాదేవీలు జరిగాయి.
Also Read
- Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
- 29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
- Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
- India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
ఈ కేసులో మార్చి 25, 2026నే సిద్ధగోని ప్రభాకర్, రామావత్ నాగరాజు నాయక్ అనే ఇద్దరు కీలక నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటినుంచి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఆది రెడ్డిని సుదీర్ఘ నిఘా తర్వాత పట్టుకున్నారు. నిందితులపై CGST చట్టం 2017 లోని పలు సెక్షన్ల కింద నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. కమిషన్ల ఆశతో తమ ఆధార్, పాన్, ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలను అపరిచితులకు ఇవ్వవద్దని అధికారులు హెచ్చరించారు. గుర్తింపు పత్రాల దుర్వినియోగం వల్ల చట్టపరమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందన్నారు. ఈ భారీ కుంభకోణంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!