Site icon NTV Telugu

France – Pakistan Controversy: పాకిస్థాన్‌పై విరుచుకుపడిన ఫ్రాన్స్.. ‘రాఫెల్‌పై పాక్ ప్రకటనలు అబద్ధం’

France Pakistan Controversy

France Pakistan Controversy

France – Pakistan Controversy: భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌ను తునాతునకలు చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్థాన్ చరిత్రలో ఒక్కసారి కూడా కలని కల. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ పాకిస్థాన్‌ను కొలుకోలేని షాక్‌కు గురి చేసిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీంతో నాటి నుంచి కూడా దాయాది దేశం ఆపరేషన్ సింధూర్ గురించి అబద్ధాలు చెబుతూనే ఉంది. దేశంలో జరిగిన విధ్వంసాన్ని దాచుకోలేక, పాకిస్థాన్ ప్రతిచోటా కూడా భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్ విమానాలను కూల్చివేసినట్లు పేర్కొంది. ఇదే సమయంలో ఫ్రాన్స్ స్వయంగా పాకిస్థాన్‌ పోరాట శైలికి ప్రశంసించిందనే కథనంతో దాయాది దేశం వివిధ కల్పిత కథలను అల్లింది. తాజాగా ఈ కల్పిత కథలపై ఫ్రాన్స్ విరుచుకుపడింది.

READ ALSO: Ind vs SA 2nd Test: ముగిసిన రెండోరోజు ఆట.. దక్షిణాఫ్రికా 489 ఆలౌట్

పాకిస్థాన్ ప్రముఖ వార్తా ఛానల్ జియో టీవీ జర్నలిస్ట్ హమీద్ మీర్.. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం – పాకిస్థాన్ మధ్య జరిగిన వైమానిక యుద్ధంలో పాకిస్థాన్ అపూర్వమైన బలాన్ని ప్రదర్శించిందని పేర్కొన్నారు. ఈ వాదనకు ఆయన ఫ్రెంచ్ నావికాదళ కమాండర్‌ను కూడా ఉదహరించారు. ఫ్రెంచ్ కమాండర్ కెప్టెన్ లౌనే పాకిస్థాన్ వైమానిక దళాన్ని ప్రశంసించారని, పాక్ ఈ యుద్ధాన్ని బాగా నిర్వహించిందని, అనేక భారతీయ రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చివేసిందని ఆయన అంగీకరించారని ఈ ఛానల్ పేర్కొంది.

పాకిస్థాన్‌పై విరుచుకుపడిన ఫ్రాన్స్..
పాకిస్థాన్ న్యూస్ ఛానల్ ఈ వాదన చేసిన ఒక రోజు తర్వాత.. ఫ్రెంచ్ నేవీ ఆ కథనాన్ని పూర్తిగా తిరస్కరించింది. ఫ్రెంచ్ నేవీ తన అధికారిక X ఖాతాలో దీనిని అబద్ధమని స్పష్టంగా పేర్కొంది. “#FalseNews, ఈ ప్రకటనలు కెప్టెన్ లౌనే పేరుతో ప్రచురించారు. అయినప్పటికీ అతను ఎటువంటి ఇంటర్వ్యూ లేదా ప్రకటనకు అధికారం ఇవ్వలేదు. మొత్తం కథనం తప్పుడు సమాచారం, పుకార్లతో నిండి ఉంది” అని ఈ ప్రకటనలో ఫ్రెంచ్ నేవీ వెల్లడించింది. పారిస్‌లో జరిగిన ఇండో-పసిఫిక్ భద్రతా సమావేశంలో అతిథిగా హాజరైన హమీద్ మీర్, కెప్టెన్ లౌనీ పాకిస్థాన్ ఉన్నతమైన వ్యూహాలను ప్రశంసించాడని పేర్కొన్నారు. ఈ వార్త వెంటనే పాకిస్థాన్‌లో వైరల్‌గా మారి అక్కడి ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే అలాంటి ప్రకటన ఎప్పుడూ చేయలేదని ఫ్రెంచ్ నేవీ ఇప్పుడు స్పష్టం చేసింది. పాకిస్థాన్ జర్నలిస్ట్ హమీద్ మీర్‌పై గతంలో కూడా ఇలాంటి ఏకపక్ష, తప్పుడు వార్తలను ప్రచురించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన ఇంకా ఫ్రాన్స్ ప్రకటనపై స్పందించలేదు. ఇంతలో ఫ్రెంచ్ నేవీ ఈ వార్త పచ్చి అబద్ధమని, తాము ఎప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదని, ఈ తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా ఆపాలని పేర్కొంది.

READ ALSO: Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి వాయిదా.. ఎందుకో తెలుసా!

Exit mobile version