Site icon NTV Telugu

Jharkhand Fire Accident : విషాదం.. పెళ్లికని వచ్చారు.. కళ్లెదుటే కాలిపోయారు

Fire

Fire

Jharkhand Fire Accident : జార్ఖండ్ లో విషాదం నెలకొంది. ధన్ బాద్ లోని ఆశ్వీరాద్ అపార్ట్ మెంట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14మంది సజీవ దహనం అయ్యారు. మరికొందరికి తీవ్రగాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 13 అంతస్తుల అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. రెండో అంతస్తులో తొలుత మొదలైన మంటలు ఆ తర్వాత మిగత అంతస్తులకు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

Read Also: Pooja Hegde: పట్టుచీర కట్టిన బుట్టబొమ్మ.. ఆ అందానికి దిష్టి తగులునేమోనమ్మా

పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకని పెద్ద సంఖ్యలో జనాలు అపార్ట్ మెంట్ కు వచ్చారు. ఇంతలో మంటలు చెలరేగాయి. కాగా, అగ్నిప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ఈ అపార్ట్ మెంట్ లో 400 మందికిపైగా నివాసం ఉంటున్నారు. అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. అగ్నిప్రమాదం ఘటన మృతుల్లో 10 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Atlee: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ డైరెక్టర్ భార్య

ధన్ బాద్ డిప్యూటీ కమిషనర్ సందీప్ సింగ్ ఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై సీఎం హేమంత్ సొరేన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం జరిగి పలువురు చనిపోవడం విషాదకరం అన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం సోరేన్.

Exit mobile version