Diamond League: ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ మీటింగ్‌లో భారత అథ్లెట్లకు ఇదివరకెప్పుడూ లేని స్థాయిలో ప్రాతినిధ్యం లభించింది. మే 16న దోహాలో జరగనున్న ఈ లీగ్‌లో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా నేతృత్వంలో నాలుగు మంది భారత అథ్లెట్లు తలపడనున్నారు. 2023లో దోహా డైమండ్ లీగ్‌ను 88.67 మీటర్ల త్రో వేసి గెలిచిన నీరజ్, 2024లో 88.36 మీటర్లతో రెండో స్థానాన్ని సాధించాడు. ఈ ఏడాది కూడా జావెలిన్ విభాగంలో పోటీ పడనున్నాడు. అతనితో పాటు మరో భారత అథ్లెట్ కిషోర్ జెనా కూడా జావెలిన్ విభాగంలో పోటీకి సిద్ధమవుతున్నాడు. జెనా 2024 డైమండ్ లీగ్‌లో పాల్గొన్నప్పటికీ.. 76.31 మీటర్ల త్రో తో తొమ్మిదవ స్థానాన్ని మాత్రమే పొందాడు.
Read Also: Operation Sindoor: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ సిబ్బంది.. పేర్లను విడుదల చేసిన భారత్
ఇక పురుషుల జావెలిన్ విభాగం ఈసారి అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇందులో ద్వితీయ ప్రపంచ చాంపియన్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెనాడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్, 2024 డైమండ్ లీగ్ విజేత జకుబ్ వాడ్లెచ్ (చెక్ రిపబ్లిక్), జర్మనీ నుండి జూలియన్ వెబర్, మ్యాక్స్ డెహ్నింగ్, అలాగే కెన్యాకు చెందిన జూలియస్ యెగో, జపాన్‌కు చెందిన రోడరిక్ జెన్‌కీ డీన్ లాంటి అథ్లెట్లు ఏ పోటీలలో పాల్గొంటున్నారు.
Virat Kohli: రిటైర్మెంట్‌పై తుది నిర్ణయం తీసుకోని విరాట్ కోహ్లీ!
భారతదేశానికి చెందిన పురుషుల 5000 మీటర్ల జాతీయ రికార్డు విజేత గుల్వీర్ సింగ్ తొలిసారి డైమండ్ లీగ్‌లో పాల్గొంటున్నాడు. అతని అరంగేట్రం పై భారత అథ్లెటిక్స్ లో ఉత్సాహం నెలకొంది. అతని ప్రదర్శన పట్ల క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మహిళల 3000 మీటర్ల స్టీపుల్ చేస్ లో జాతీయ రికార్డు సృష్టించిన పరుల్ చౌదరి కూడా ఈ పోటీలో పాల్గొననుంది. ఆమె ప్రదర్శన భారత మహిళా అథ్లెటిక్స్‌కు గర్వకారణంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
